ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ బయటపడుతుందని బాబు డ్రామాలు

రైతులను రెచ్చగొడుతూ ఆత్మహత్యలకు ప్రేరేపించే ఉన్మాదిలా ప్రవర్తన

మనందరం కలిసి ఉందాం.. కలిసి రాష్ట్రాన్ని బాగుచేసుకుందాం

అమరావతి రైతులు ఎవరూ అధైర్యపడొద్దు.. మేమంతా మీతో ఉన్నాం

జైలు జీవితం గడపాల్సి వస్తుందనే భయంతో చంద్రబాబు డ్రామాలు

తెలుగుదేశం ఊబిలో పడి రైతులు, ప్రజలు మోసపోవద్దు

మహానటి సినిమాలో సావిత్రి పాత్రలా.. నారా భువనేశ్వరి డ్రామా పండించారు

రాజధాని కోసం భూములు కానీ, భూముల కోసం రాజధాని కావాలా..?

ఈ ప్రాంత ప్రజలంతా చర్చలకు సిద్ధమై సమస్యలు పరిష్కరించుకోండి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

 

తాడేపల్లి: చేసిన నేరం బయటపడుతుంది. శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయంతో చంద్రబాబు రైతులను రెచ్చగొడుతూ.. ఆత్మహత్యలకు ప్రేరేపించే ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు.  తప్పు నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి చంద్రబాబు సిద్ధపడ్డాడు. రైతుల ప్రాణాలు, సొంత సామాజిక వర్గాన్ని కూడా పణంగా  పెట్టి డ్రామాను రక్తికట్టిస్తున్నాడు. దయచేసి అమరావతి ప్రాంత రైతులు చంద్రబాబు ఊబిలో పడి మోసపోవద్దు.. మనమందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం.. రాజధాని అమరావతిలోనే ఉంది.. అన్నదమ్ముళ్లా కలిసి ఉందాం.. వెనుకబడిన రాయలసీమ ప్రాంత రైతుగా మాట్లాడుతున్నానన్నారు. ఇప్పటికే చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో రూ.2.65 లక్షల కోట్ల అప్పు చేశారు. సంవత్సరానికి రూ.20 వేల వడ్డీ కడుతున్న ఈ తరుణంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఎక్కడా కూడా అమరావతి తరలిస్తున్నారని, అమరావతి రాజధాని కాదని రెచ్చగొట్టే పార్టీలను, నాయకులను నమ్మొద్దన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. చంద్రబాబు అమరావతిలో చేసిన మోసాలపై వీడియో ప్రదర్శన అనంతరం ఆయన ఏం మాట్లాడారంటే..

‘రాజధాని ఇక్కడే ఉంది. అమరావతి రాజధాని మనందరి రాజధాని, అనంతపురం జిల్లాలో అతి చౌకగా భూములు ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ రాజధాని కావాలని ఎప్పుడూ అడగలేదు. అమరావతి మనందరి రాజధాని కావాలని స్వాగతించాం. గతంలో రాజధానిఆ ఉన్న కర్నూలును రాయలసీమ వాసులం త్యాగం చేశాం. ఈ రోజు కూడా 13 జిల్లాల ప్రజలందరం కలిసి ఉండాలి. మన అమరావతి రాజధాని మనతో ఉండాలని కోరుకుంటున్నాం. అన్నదమ్ముళ్లుగా బాధ్యతలు పంచుకోవాలనుకుంటున్నాం. అది విశాఖ అయినా, కర్నూలు అయినా, అమరావతి అయినా.. అంతేగాని విడిపోవాలనుకోవడం లేదు. కానీ, ఇక్కడ ఉద్యమాల పేరుతో రెచ్చగొడుతున్న చంద్రబాబును గమనించండి. ఎందుకు చేస్తున్నారంటే 21 నిమిషాల విడివి గల వీడియో చూశారు. చంద్రబాబు తప్పు చేశాడు.. రాజధాని ప్రాంతం ఎక్కడకు వస్తుందో ముందుగానే నిర్ణయించుకున్నారు. జూన్‌ నుంచి డిసెంబర్‌ వరకు భూములు కొన్నారు.. కొనిపించారు. ఆ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ భూములు కొన్నారు.

55 వేల ఎకరాలకు ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్‌ సృష్టించి రూ. లక్షా 10 వేల కోట్లు కావాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలను బుట్టదాఖలు చేశారు. నారాయణ కమిటీ పేరుతో చేయాలనుకుంది చేశారు. అంటే ఆ ప్రాంత రైతులను మోసం చేసింది చంద్రబాబు కాదా..? అమరావతిని ప్రకటించిన తరువాత రూ. లక్షా 10 వేల కోట్లు ఖర్చు అవుతుందని, కేంద్రం సాయం చేయాలని అనేక సార్లు అడిగారు. కేంద్రం రూ. 1500 కోట్లు మాత్రమే వచ్చాయి. డబ్బులు లేవని తెలుసు.. ఎక్కడ నుంచి తెస్తామో ఆలోచన లేదు.. కానీ రూ. 53 వేల కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచి తాబేదారులకు పనులు అప్పజెప్పారు. ఐదు సంవత్సరాల్లో రూ. 5500 కోట్లు ఖర్చు చేశారు.

ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టగానే.. ఆ పనులు పూర్తి చేయాలని రూ.47,500 కోట్ల నిధులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చిత్తశుద్ధి ఉంది కాబట్టే సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. అంతేగానీ రాజధాని ప్రాంత రైతులను మోసం చేయాలని ఎక్కడా కూడా ప్రభుత్వం భావించలేదు. రైతులకు అన్యాయం జరిగింది.. రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని పవన్‌ కల్యాణ్‌ గతంలో ఉద్యమం పేరుతో పెరుగన్నం తిన్నారు. ఇంత జరుగుతున్నా.. రైతులను రెచ్చగొడుతున్నా.. చంద్రబాబు చేసేది తప్పు అని తెలిసినా కూడా పవన్‌ ఆయనకే మద్దతు తెలుపుతున్నాడు. చంద్రబాబు ద్విముఖ వ్యూహం, రెండు నాలుకల ధోరణి చూస్తే.. భూములు తానే కొన్నాడు.. ఇల్లు చక్కదిద్దుకున్నాడు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశాడు.. ఆర్థికంగా బలోపేతం కావడానికి ఇదంతా చంద్రబాబు చేశాడు. ఎక్కడైనా రాజధాని కోసం భూములు కావాలి కానీ, భూముల కోసం రాజధాని కాదు. కానీ, ఆ విధంగా చేసింది చంద్రబాబే. రూ. లక్షా 10 వేల కోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు ఈ రోజు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ క్యాపిటల్‌ అంటున్నాడు. డబ్బులు అక్కర్లేకుండానే కాంట్రాక్టర్లు పనిచేస్తారా..? ఎకరం రూ.10 కోట్లతో పది వేల ఎకరాలు అమ్మితే రూ. లక్ష కోట్లు వస్తుందని చెబుతున్నాడు. ఇవన్నీ ఆయన ఎందుకు చేయలేదు. ఈ పని చంద్రబాబు పూర్తిచేసి ఉండి ఉంటే.. ఈ రోజు ఈ ప్రాంత రైతులకు అనిశ్చితస్థితి వచ్చేది కాదు కదా అని ప్రశ్నిస్తున్నాం.

రైతులను రెచ్చగొట్టేది.. ఆత్మహత్యలకు ప్రేరేపించేది చంద్రబాబు. చేసిన నేరం బయటపడుతుంది.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. శిక్ష అనుభవించాల్సి వస్తుందనే భయంతో రైతులను రెచ్చగొడుతూ.. ఆత్మహత్యలకు ప్రేరేపించే ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడు. తప్పు నుంచి తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి సిద్ధపడ్డాడు. రైతుల ప్రాణాలు, సొంత సామాజిక వర్గాన్ని కూడా పణంగా  పెట్టి డ్రామాను రెక్తికట్టిస్తున్నాడు. మహానటి సినిమాలో సావిత్రి తన పాత్రలో ఒదిగిపోతూ ఆ రోజు యుద్ధంలో ప్రాణాలు కోల్పోతున్న సైన్యానికి బాసటగా తన ఒంటిపై ఉన్న నగలను త్యాగం చేసినట్లుగా సినిమాలో చూశాం. అదే రకంగా ఈ రోజు తండ్రికి అన్యాయం జరిగినా.. రాష్ట్రం విభజన జరిగినా.. పది సంవత్సరాలు హైదరాబాద్‌ను రాజధానిగా అనుభవించే హక్కు ఉన్నా.. హైదరాబాద్‌ నుంచి తరలివచ్చే పరిస్థితి ఉన్నా.. ఏ రోజూ బయటకు రాని భువనేశ్వరి దేవీ ఈ రోజు డ్రామాను పండించారు.

ప్రజలు, అమరావతి రైతులారా.. మీమంతా మీతో ఉన్నాం.. మూడు ప్రాంతాల రైతులు కూడా మీతో ఉన్నారు. రైతులు ఎక్కడైనా ఒక్కటే. అనంతపురం జిల్లాలో వలసలు పోతున్న రైతులను గమనించండి. పనులకు కూలీలుగా వెళ్తున్నా ఉత్తరాంధ్ర రైతులను గమనించండి. ఆత్మహత్యలు చేసుకుంటున్న మా ప్రాంతాన్ని గమనించండి. అన్నదమ్ములం కలిసి బాగుపడుదాం.. అందరం కలిసి ఎదుగుదాం.. అందరం కలిసి ఉందామని రాయలసీమ రైతుగా నేను మాట్లాడుతున్నాను. ఎడారి కాబోతున్న రాయలసీమ ప్రాంతాలకు న్యాయం చేయాలంటే దాదాపు రూ.60 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయాలి. ఈ రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయాలంటే దాదాపు రూ. లక్షా 40 వేల కోట్లు కావాలి. సముద్రంలోకి వెళ్లిపోతున్న గోదారమ్మను ఒడిపిపట్టుకోవాలంటే.. గోదావరి, పెన్నాకు రూ. 60 వేల కోట్లు కావాలి. నాడు – నేడు కార్యక్రమం ద్వారా మన పిల్లలకు మంచి చదువు చెప్పాలన్నా.. అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా మన పిల్లలకు భవిష్యత్తు అందించాలన్నా.. ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా పేదలకు న్యాయం చేయాలన్నా.. మనకు డబ్బు కావాలి. ఇప్పటికే చంద్రబాబు ఐదు సంవత్సరాల్లో రూ.2.65 లక్షల కోట్ల అప్పు చేశారు. సంవత్సరానికి రూ.20 వేల వడ్డీ కడుతున్న ఈ తరుణంలో కూడా ఎక్కడా రాజీ పడకుండా సంక్షేమ పథకాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.. అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు తప్ప ఎక్కడా కూడా అమరావతి తరలిస్తున్నారని, అమరావతి రాజధాని కాదని రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మొద్దు. ఈ రోజుకు కూడా ఇది మన అమరావతి. రెచ్చగొట్టే పార్టీలు, నాయకులను నమ్మొద్దు. దోపిడీ విధానాలను బయటపడకుండా తమను తాము కాపాడుకోవడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను గమనించి అందరం కలిసి ముందుకు వెళ్దాం. చర్చలకు సిద్ధమై ఈ ప్రాంత ప్రజలంతా వారి సమస్యలను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని కోరుతున్నాం’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చెప్పారు.

Back to Top