నంద్యాల: మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శుక్రవారం మహానంది మండలం గోపవరం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శిల్పా చక్రపాణిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. మూడేళ్ల వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి ఇంటికి చేసిన మేలును ఎమ్మెల్యే ఇంటింటా వివరించారు. ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని వెంట వచ్చిన అధికారులకు సూచించారు. అనంతరం గోపవరం గ్రామం జడ్పీహెచ్ స్కూల్ ఆవరణలో 40 లక్షల రూపాయలతో నిర్మించబోతున్న అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో, పాదయాత్రలో ఇచ్చిన హామీలను అన్నిటిని నెరవేర్చేందుకు సీఎం వైయస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నారని తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, 600 హామీలు ఇచ్చి.. మేనిఫెస్టోను కూడా వెబ్‌సైట్ నుంచి తొలగించారని విమర్శించారు. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం వైయస్ జగన్‌ది అని గుర్తు చేశారు. కరుట్లపల్లిలో గడపకు గడపకు మన ప్రభుత్వం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామంలో శుక్రవారం "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమం జరిగింది. ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైయస్ఆర్‌సీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.