చంద్రబాబు సేవలు చాలు..ఇక రెస్టు తీసుకోవచ్చు

ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు
 

అసెంబ్లీ: చంద్రబాబు సేవలు చాలని, ఆయన రెస్టు తీసుకుంటే బాగుంటుందని ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అన్నారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సభలో అప్పలరాజు మాట్లాడుతూ..ఈ సభలో మేం జూనియర్స్‌..చాలా నేర్చుకోవాల్సి ఉంది. చంద్రబాబు స్పీకర్‌ను చాలా అవమానకరంగా మాట్లాడారు. స్పీకర్‌ది మా ఊరు. సభ మొదటి రోజు మీరు ఒక మాట అన్నారు. ఆ పాపంలో మేం భాగస్వామ్యం అయ్యామన్నారు. వెనుకబడిన వర్గాలకు స్పీకర్‌ పదవి ఇవ్వడంతో చంద్రబాబు మిమ్మల్ని చైర్‌లో కూర్చోబెట్టేందుకు కూడా రాలేదు. ఇది ఓ మానసిక వ్యాధి. ముందుగా చంద్రబాబుకు పరీక్షలు చేయించాలి. జబ్బు నయం అయ్యాక అసెంబ్లీలోకి తీసుకురావాలి. ఆయన 40 ఏళ్ల అనుభవం అన్నారు. ఆయన సేవలు చాలు. ఇక రెస్టు తీసుకోవచ్చు. మరొక ఆరు నెలల్లో చాలా చూస్తారని చంద్రబాబు బెదిరించారు. చంద్రబాబు మాటలు వింటుంటే భయంగా ఉంది. మొన్న పార్లమెంట్‌కు వెళ్లినప్పుడు వంగి ఉన్నారు. నిన్న అమరావతి వెళ్లి పడుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దండ వేసుకున్నారు. బాబును చూస్తే భయంగా ఉంది. డాక్టర్‌కు చెప్పి ఆయనకు ఉన్న వ్యాధిని నయం చేయాలి. మా ఊరి నాయకుడిపై అవాంఛనీయమైన మాటలు మాట్లాడితే ఊరుకోం. 

Read Also: చట్టసభలో ప్రజాస్వామ్యాన్ని బాబు ఖూనీ చేశారు

తాజా వీడియోలు

Back to Top