చట్టసభలో ప్రజాస్వామ్యాన్ని బాబు ఖూనీ చేశారు

 ఎమ్మెల్యే మేరుగ నాగార్జున
 

అసెంబ్లీ: చట్టసభలో ఈ రోజు చంద్రబాబు అంబేద్కర్‌ రచించిన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు. సభలో ఆయన మాట్లాడుతూ..ఈ రోజు ఏపీ అసెంబ్లీలో విలువలు, విశ్వసనీయతకు చంద్రబాబు పాతర వేశారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ స్పీకర్‌ను  అగౌరవపరుస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు కులాలు, మతాలను తీసుకొస్తారు. పేదవారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కృషి చేస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారు. దళితులు, బహుజనులు బతకడానికి చంద్రబాబు హయాంలో కిష్టపరిస్థితులు ఉండేవి. చంద్రబాబు ఇలాంటి సభలో ఉండకూడదు.

Read Also: పేదింటి పిల్లలూ ఎదగాలంటే ఇంగ్లీష్ కావాలి

Back to Top