సీఎం వైయ‌స్ జగన్‌ కృషితోనే నాసిన్ ప్రాజెక్టు సాకారం

ఎమ్మెల్యే శంకర్ నారాయణ

అనంత‌పురం:   ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి కృషి వల్లే నేషనల్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్) సాకారమైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శంక‌ర్ నారాయ‌ణ పేర్కొన్నారు. నాసిన్ ప్రాజెక్ట్‌కు పెనుకొండ నియోజకవర్గంలో 500 ఎకరాల భూమి కేటాయింపు జ‌రిగింద‌న్నారు. మౌలిక సదుపాయాల కల్పన సీఎం వైయ‌స్‌ జగన్ కృషి ఫలితమే అన్నారు. సీఎం వైయ‌స్ జగన్ కృషితో విభజన చట్టం హామీలు అమలవుతున్నాయన్నారు. 2014-19 దాకా సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. నాసిన్ ప్రాజెక్టును పట్టించుకోలేదని ఎమ్మెల్యే తెలిపారు.

Back to Top