మద్యం సిండికేట్లతో చంద్రబాబు కుమ్మక్కు

ఎమ్మెల్యే ఆర్కే రోజా

అమ‌రావ‌తి: మద్యం సిండికేట్లతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. 2014లో ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసే స‌మ‌యంలో చంద్ర‌బాబు బెల్టుషాపులు ఎత్తేస్తానని హామీ ఇచ్చి 40వేల షాపులు తెరిచారని ఆమె దుయ్యబట్టారు. చంద్రబాబు పాలనలో మద్యాని ఏరులై పారించారని రోజా మండిపడ్డారు.  టీడీపీ ఐదేళ్ల పాల‌న‌లో మ‌ద్యం ఏరులై పారింద‌న్నారు. చంద్ర‌బాబు సిండికెట్ల‌తో కుమ్మ‌క్కై ఆడ‌వాళ ప‌సుపు కుంకుమ‌ల‌తో , జీవితాల‌తో చెల‌గాట‌మాడారు. అందుకే టీడీపీ ప్ర‌భుత్వాన్ని త‌రిమికొట్టారు. చంద్ర‌బాబు ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వ‌లేదు. క్వార్ట‌ర్ బాటిల్స్ ఇచ్చారు.  టీడీపీ పాల‌న‌లో ఐదేళ్ల‌లో 6 వేల పాఠ‌శాల‌లు మూసివేశారు. 40 వేల బెల్ట్‌షాపులు తెర‌చిన‌ వీళ్లా మా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గురించి మాట్లాడేది. చంద్ర‌బాబు హ‌యాంలో 2020 వ‌ర‌కు అనుమతులు ఇస్తూ 2015లోనే నిర్ణ‌యం తీసుకున్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో ఏటీఎం మ‌నీ దొరికిందో లేదో తెలియ‌దు కానీ, ఎనీటైం మందు దొరికేది. సీనియారిటీ గురించి మాట్లాడే చంద్ర‌బాబు ఐదేళ్ల‌లో 75 వేల కోట్ల మ‌ద్యాన్ని ఏరులై పారించి రాష్ట్రానికి దుర్గ‌తి ప‌ట్టించారు. వీళ్లు మ‌ద్యం గురించి మాట్లాడుతుంటే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది. ఎన్టీఆర్‌కు వెన్నుపొటు పొడిచిన చంద్ర‌బాబు మ‌ద్య‌పాన నిషేధానికి తూట్లు పొడిచారు. ఆడ‌వాళ్ల జీవితాల‌తో చెల‌గాట‌మాడిన వీరిని ఇంటికే ప‌రిమితం చేశారు. బీసీ స్పీక‌ర్‌పై పేప‌ర్లు చించివేయ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. మ‌హిళ‌ల అక్ర‌మ ర‌వాణాలో, వేధించ‌డంలో టీడీపీ నంబ‌ర్ వ‌న్‌, ఐదేళ్ల క్రైమ్ రేట్ 11 శాతం పెరిగింది. బ‌డి గుడి లేకుండా సందు సందులో మ‌ద్యం షాపులు పెట్టించారు. చంద్ర‌బాబును మెప్పించేందుకు స‌భ‌ను స్తంభింప‌జేయాల‌ని టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నారు. ఈ స‌భ ప్ర‌జ‌ల‌కు ఎంతో అవ‌స‌రం. స‌భా స‌మ‌యాన్ని దుర్వినియోగం చేస్తున్న వీరికి బుద్ధి చెప్పాల‌ని ఆర్కే రోజా కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top