కరువును అవినీతిగా మార్చకున్న అనకొండ చంద్రబాబు

బాబు ఇక శాశ్వతంగా రాజకీయాల్లోంచి పారిపోతారు

ప్రజల కోసం నిలబడి రాజకీయ రాబంధులను ఎదుర్కొన్న నాయకుడు వైయస్‌ జగన్‌

ఇచ్చిన మాట కోసం పదేళ్లు పోరాటం చేశారు

మొదటి బడ్జెట్‌తోనే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చరిత్ర సృష్టించారు

మానవత్వం ఉన్న సీఎంగా కేటాయింపులు చేశారు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా

 

అమరావతి: పేదల కోసం ఇన్ని పథకాలు ప్రవేశపెట్టిన మొట్టమొదటి అసెంబ్లీ ఇదేనని ప్రజలంతా మాట్లాడుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గత ఐదు సంవత్సరాలున్న ప్రభుత్వం అప్రాప్రియేషన్‌ బిల్లు పెట్టి పాస్‌ చేసుకొని వెళ్లడాన్ని చేశామని, కానీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్రాప్రియేషన్‌ బిల్లు చాలా విభిన్నమైందన్నారు. బిల్లు ద్వారా ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా ప్రజలకు అందించే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు చూసిన తరువాత బిల్లుకు మనస్సాక్షి ఉన్న ఎవరూ వ్యతిరేకించరని చెప్పారు. 2009 సెప్టెంబర్‌ 2వ తేదీన మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కోట్లాది మంది కళ్ల ముందు నుంచి అదృశ్యమయ్యారని, దేశం గర్వించదగ్గ పథకాలు ప్రవేశపెట్టి తెలుగువాడి పాలన ఏ విధంగా ఉంటుందో చాటి చెప్పిన వైయస్‌ఆర్‌ హెలికాప్టర్‌ ప్రమాదంలో అకాలమరణం చెందారన్నారు. తాను ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడికి అందాయా.. లేదా అని స్వయంగా చూడాలని బయల్దేరిన వైయస్‌ఆర్‌ ప్రజలను అనాథలుగా వదిలి అనంతలోకాలకు వెళ్లారన్నారు. అన్నం పెట్టిన రాజన్న, అక్షరాలు దిద్దించిన రాజన్న ఇక లేరని తెలిసి ప్రజలంతా గుండెలవిసేలా ఏడ్చారని గుర్తు చేశారు. 

వైయస్‌ఆర్‌ మరణాంతరం నుంచి రాజన్న రాజ్యం ఎప్పుడు వస్తుందా.. మమ్మల్ని కాపాడేవారు ఎప్పుడు వస్తారా అని ప్రజలంతా కళ్లు కాయలుకాసేలా ఎదురుచూశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 50 రోజుల పాలన చూసిన తరువాత రాజన్న రాజ్యం వచ్చింది.. ప్రజల రాజ్యం వచ్చిందని ప్రతి ఒక్కరూ గుండె మీద చెయ్యి వేసుకొని ధైర్యం చెబుతున్నారన్నారు. సాధారణంగా ప్రజలంతా బడ్జెట్‌ మనకు సంబంధం లేనిది, వాళ్లేందో లెక్కలు చెప్పుకుంటున్నారని పట్టించుకోకుండా ఉంటారని, కానీ చరిత్రలో మొదటి సారి కాలేజీకి వెళ్లే యువత, అన్నం పెట్టే రైతులు, అవ్వాతాతలు, ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, ఆటో డ్రైవర్లు, పిల్లల కోసం కష్టపడే తల్లులు, మత్స్యకారులు, నాయీ బ్రాహ్మణులు ఇలా ఐదు కోట్ల మంది ఇది మా బడ్జెట్‌ అని ఫీలవుతున్నారన్నారు. ఇలాంటి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రజలంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. మాట మీద నిలబడే సీఎంను మొదటి సారి చూస్తున్నామన్నారు. 

ప్రజలకు ఇచ్చిన మాట కోసం రాజకీయ రాబంధలు, ఢిల్లీ పెద్దలను, రాష్ట్రంలోని ఎల్లో గద్దలను ఎదరించి, అక్రమంగా జైలుకు పంపించినా, కుట్రలు చేసినా భరించి ప్రజా క్షేత్రంలో నిలబడి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజల కోసం పోరాడారన్నారు. ఆఖరికి వైయస్‌ కుటుంబంలోని మహిళల చేత కూడా కన్నీరు పెట్టించినా.. ప్రజలకు ఇచ్చిన మాట కోసం, వైయస్‌ఆర్‌ ఆశయ సాధన కోసం తడబడ కుండా పది సంవత్సరాలు ప్రజల పక్షాన నిలబడిపోరాడిన ఏకైక వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోరాట ఫలితాలన్నీ బడ్జెట్‌ ద్వారా ప్రజలకు అందేలా చేస్తున్నారన్నారు. 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లు ఇచ్చారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సృష్టించిన చరిత్ర చూస్తే ప్రజలు ఆయనపై పెట్టుకున్న విశ్వాసం తెలుస్తుందన్నారు. ఎంతో మంది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కొడుకులను చూశామని, కానీ వైయస్‌ఆర్‌ కొడుకు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి లాంటి నాయకుడిని చూడలేదు.. చూడబోరన్నారు. మన రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కొడుకు 123 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీని 23 సీట్లకు తీసుకువచ్చారని, సొంత కొడుకు లోకేష్‌ను కూడా గెలిపించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో చంద్రబాబు ఉన్నాడన్నారు. అడ్డదారిలో వచ్చిన ఎమ్మెల్సీ పదవితో ఈ రోజు రాజకీయ పబ్బం గడుపుకుంటూ ట్విట్టర్‌లో ప్రభుత్వానికే ప్రశ్నలు వేస్తున్నాడని, లోకేష్‌ అమాయకత్వం చూసి నవ్వాలో.. ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. అప్రాప్రియేషన్‌ బిల్లుపై మాట్లాడలేక చంద్రబాబు శాసనసభ నుంచి పారిపోయారన్నారు. చంద్రబాబు పారిపోవడం ఇక్కడితో ఆగదని, సీఎం వైయస్‌ జగన్‌ చేపట్టిన పథకాలు చూసి శాశ్వతంగా రాజకీయాల్లోంచి పారిపోక తప్పదన్నారు. ఐదు సంవత్సరాలు తుఫాన్‌లు వచ్చినా.. రైతుల కరువును కూడా అవినీతిగా మార్చుకున్న అనకొండ చంద్రబాబు అని, రెయిన్‌గన్‌లతో కోట్లాది రూపాయలు దోచుకున్నారని మండిపడ్డారు.

Back to Top