వైయ‌స్ఆర్‌ జిల్లాలో లోకేష్ పాదయాత్ర అట్టర్ ఫ్లాప్..

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి

క‌డ‌ప‌:  వైయ‌స్ఆర్ జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం క‌డ‌ప న‌గ‌రంలో మేయ‌ర్ సురేష్‌బాబుతో క‌లిసి ర‌ఘురామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు, ప్రజలకు లోకేష్ పాదయాత్ర గుదిబండగా తయారైంద‌న్నారు. ప్ర‌తి చోట విసిరి వేస్తే పక్క ప్రాంతానికి ఎగిరి పడుతున్నాడు..యువగళం పాదయాత్ర చూసి ప్రజలు నవ్వుకుంటున్నార‌ని చెప్పారు. కేవలం గంటన్న‌ర‌లో పాదయాత్ర పూర్తి చేసిన ఘనత లోకేష్‌కే ద‌క్కుతుంద‌ని ఎద్దేవా చేశారు. ప్రజలు లేక పాదయాత్ర పూర్తి చేసుకుని నిద్ర పోయాడ‌ని, వైయ‌స్ జగన్ పాదయాత్ర కు లోకేష్ పాదయాత్ర కు నక్కకు నాగ లోకానికి ఉన్న తేడా ఉంద‌ని అభివ‌ర్ణించారు. ఫోటోలకు ఫోజులు తప్ప ఇంకేం లేదన్నారు. కులాల వారిగా లోకేష్ సమావేశాలు, ఇళ్ల స్థలాలు కోసం వినతిపత్రం ఇచ్చారని లోకేష్ అన్నాడు.. నాడు చంద్రబాబు హయాంలో ఎందుకు వీరికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేద‌ని ప్ర‌శ్నించారు. ప్రతి ప్రాంతంలోకి వెళ్లి అనవసర ఆరోపణలు, అవాస్త‌వాల‌తో ప్ర‌జ‌ల‌కు కల్లబొల్లి మాటలు చెబుతున్నార‌ని ఫైర్ అయ్యారు. గండికోట ప్రాజెక్టు నిర్మాణంలో నాడు ప్రగల్భాలు పలికి చంద్రబాబు ఏం చేశార‌ని నిల‌దీశారు. గండికోట ప్రాజెక్టును పూర్తి చేసి నీటిని నింపిన ఘనత మా ప్రభుత్వానిది..వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిదే అని స్ప‌ష్టం చేశారు. అన్ని నీటి ప్రాజెక్టులకు నీటిని అందజేసి సాగు , తాగు నీటి కోసం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామ‌ని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కి ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్  కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. 
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసి చూపించిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుంద‌ని వివ‌రించారు.  సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ యానదయ్య, రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ చైర్మన్ పులి సునీల్ కుమార్, నాయకులు నారపు రెడ్డి సుబ్బారెడ్డి,  కార్పొరేటర్లు మల్లికార్జున, రామ లక్ష్మణ రెడ్డి , సూర్య నారాయణ, రాజేంద్ర నాథ్ రెడ్డి , చైతన్య, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top