రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసిస్తున్నాం

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర బహిరంగ స‌భ‌లో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి 

వైయ‌స్ఆర్ జిల్లా: రెండోసారి ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖున వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పనిసరిగా విశ్వసిస్తున్నామ‌ని, ఇందులో ఏమాత్రం అనుమానం లేద‌ని ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.  ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పదిమంది ఎమ్మెల్యేలవుతారని విశ్వాసం వ్య‌క్తం చేశారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర బహిరంగ స‌భ‌లో ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి మాట్లాడారు.

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఏమ‌న్నారంటే..

వైయ‌స్ఆర్ ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి, కడప పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన 7 నియోజక వర్గాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు, వేదికపై ఉన్న పెద్దలు, ముఖ్యంగా మన ప్రియతమ నాయకుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని హృదయపూర్వకంగా మన ప్రొద్దుటూరు నియోజకవర్గం ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా రెండు విషయాలు ఆయనకు చెప్పుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. ఒకటి.. రెండుసార్లు నన్ను ఎమ్మెల్యేని చేసి మరోమారు నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినందుకు హృదయపూర్వకంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెండు.. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి సంక్షేమాన్ని రూ.1700 కోట్లను నా నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలకు ఇచ్చి పేదరిక జీవితాలలో సంతోషాన్ని నింపినందుకు, వారి సారధ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి కవల పిల్లలు అయినందుకు దాదాపుగా రూ.1300 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినందుకు, 24వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చినందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మరోమాట వారిని అడుగుతున్నా దేవుని దయ వలన ఈ ప్రజల ఆశీస్సుల చేత మళ్లీ తమరు రెండోసారి ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తారని తప్పనిసరిగా విశ్వసిస్తున్నాం. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి పదిమంది ఎమ్మెల్యేలవుతారు. 175 నియోజకవర్గాలకు 175 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గెలుస్తారని విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాను. తమరు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరొక్కసారి మీ చల్లని దీవెనలు ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, ఈ ఊరి ప్రజల అవసరాలను మీరు గుర్తెరిగి మరింత అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని తమరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే ఈ సభను నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
 

Back to Top