పల్నాడు: ఈ ప్రాంతంలో ఒకసారి పోటీ చేసిన శాసనసభ్యుడు రెండోసారి గెలిచిన పరిస్ధితి లేదు, కానీ 2009లో నేను మొదటిసారి వైయస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో ఆ తర్వాత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీస్సులతో వరసగా ఈ నియోజకవర్గానికి మూడు సార్లు మంచి మెజార్టీతో ఎన్నికయ్యాను, నా ఊపిరి ఉన్నంతవరకు వైయస్ జగన్ వెంటే ఉంటానని ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే... అందరికీ నమస్కారం, అన్నా ఆనాటి కవిసార్వభౌముడు శ్రీనాధుడు 15 వ శతాబ్ధంలో ఈ పల్నాడు ప్రాంతంలో పర్యటించినప్పుడే ఈ ప్రాంతంలో ఉన్న కరువు పరిస్ధితిని వివరించారు, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను మీరు ఈ రోజు తీర్చబోతున్నారు, ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టించిన కాటన్ దొరను గుర్తించుకున్నట్లు ఈ ప్రాంత ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ గుర్తించుకుంటారు, ఇది ఆరు దశాబ్ధాల కల, మా ప్రాంత రైతాంగాన్ని అందరూ మోసం చేశారు, జిత్తులమారి చంద్రబాబు 1996లో శంకుస్ధాపన చేసి మా రైతాంగాన్ని మోసం చేశాడు, తర్వాత లోకేష్ కూడా ఇంకోసారి శంకుస్ధాపన చేసి మోసం చేశాడు, మా ప్రాంతంలో సజ్జలు, జొన్నలు తిని బతికే పరిస్ధితి, వర్షాభావ పరిస్ధితుల వల్ల వలసలు ఎక్కువ, నాడు 2016లో జగనన్నా మీరు కరువు ధర్నా కార్యక్రమానికి వచ్చినప్పుడు వరికపూడిశెల ప్రాజెక్ట్ వస్తుందన్నారు, మీరు ఇచ్చిన మాటను, భరోసాను ఈ ప్రాంత రైతాంగానికి చెప్పాను, అన్ని అనమతులు తీసుకుని శంకుస్ధాపన చేశారు, మా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేకంగా ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరిపి అనుమతులు తీసుకొచ్చారు, ఇది మాచర్ల, వినుకొండ, ఎర్రగొండపాలెం మూడు నియోజకవర్గాల ప్రజలకు ఉపయోగకరం. పల్నాడు చరిత్రలో ఈ ప్రాజెక్ట్ నిలిచిపోతుంది, దీనికి వైయస్ఆర్ వరికపూడిశెల ప్రాజెక్ట్‌గా నామకరణం చేయాలని ఈ ప్రాంత రైతాంగం కోరిక, మీరు ఆ పేరు పెట్టాలని కోరుతున్నాను, మా ప్రాంతంలో అభివృద్ది లేదు, కక్ష్యలు, కార్పణ్యాలు ఉండే చోట నాడు నాన్నగారు 2004లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు, తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు, అభివృద్దికి బీజం వేశారు, ఈ ప్రాంతంలో ఒకసారి పోటీ చేసిన శాసనసభ్యుడు రెండోసారి గెలిచిన పరిస్ధితి లేదు, కానీ 2009లో నేను మొదటిసారి నాన్నగారి ఆశీస్సులతో ఆ తర్వాత మీ ఆశీస్సులతో నేను వరసగా ఈ నియోజకవర్గానికి మూడు సార్లు మంచి మెజార్టీతో ఎన్నికయ్యాను, నేను నా ఊపిరి ఉన్నంతవరకు మీ వెంటే ఉంటాను. ఈ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ నాలుగున్నరేళ్ళలో రూ. 1,209 కోట్లు ప్రతి పేద కుటుంబానికి ఇచ్చారు. కరోనా సమయంలో మిగిలిన నాయకులు హైదరాబాద్‌లో దాక్కుంటే మీరు ఇక్కడ ఉండి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకున్నారు, అభివృద్ది కార్యక్రమాలకు రూ. 1,115.66 కోట్లు ఇచ్చారు, మొత్తం రూ. 2,325.22 కోట్లు మా నియోజకవర్గానికి సహాయం చేశారు, చంద్రబాబు ఏ ఒక్క పేద కుటుంబానికి సహాయం చేయకపోగా అనవసర ఆరోపణలు చేస్తున్నాడు, నక్కజిత్తుల చంద్రబాబు ఎల్లోమీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నాడు. అన్నా రాబోయే 30 ఏళ్ళు ఈ రాష్ట్రానికి మీరే సీఎంగా ఉంటారు, మీకు ఆ దేవుడి ఆశీస్సులు, ప్రతి పేదవాడి గుండె చప్పుడు మీ వెంటే ఉంటాయి, అన్నా మీ నీడను కాదు కదా మీ చిటికెనవేలును తాకే దమ్ము కూడా ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు, అన్నా మా ప్రాంత సమస్యలు కూడా మీరు తీర్చాలని కోరుకుంటున్నాను, మా ప్రాంతంలో మరో 100 పడకల ఆసుపత్రిని ఇవ్వాలని కోరుకుంటున్నాను, వర్షాబావ పరిస్ధితి వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు, జలకళ ద్వారా బోర్లు వేయాలని కోరుకుంటున్నాను, మాచర్ల పట్టణానికి మంచినీటి స్కీమ్ పనులు ఆలస్యం అవుతున్నాయి, అవి కూడా త్వరితగతిన పూర్తిచేయాలని కోరుతున్నాను, మా ప్రాంతంలో ఆటోనగర్ కోసం రూ. 5.62 కోట్లు కేటాయించాలని కోరుతున్నాను, స్ధానికంగా రోడ్ల అభివృద్దికి రూ. 8 కోట్లు కేటాయిస్తే అన్నీ పూర్తవుతాయి. కారెంపూడి మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ. 1.50 కోట్లు కేటాయిస్తే అది పూర్తవుతుంది, నాగార్జునసాగర్ కట్టినప్పుడు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న నాటి ఉద్యోగులు, వారి పిల్లలకు కూడా ఆ క్వార్టర్స్ వారికి ఇవ్వాలని కోరుకుంటున్నాను, మీపై ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజల గుండెల్లో ఉన్నారు, ధన్యవాదాలు.