సీఎం వైయస్‌ జగన్‌ రాకతో సంక్రాంతి ముందే వచ్చింది

ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌

సీఎం వైయస్‌ జగన్‌ రాకతో సంక్రాంతి ముందే వచ్చిందినర్సీపట్నం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నర్సీపట్నం రావడంతో ఈ ప్రాంతానికి ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్లు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఉమా శంకర్‌ గణేష్‌ అన్నారు. నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.  

అన్నా ఈ రోజు మీ రాకతో మాకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. ముఖ్యంగా ఈ రోజు సుమారు రూ. 500 కోట్లతో మెడికల్‌ కాలేజ్‌ శంకుస్ధాపన, రూ. 470 కోట్లతో తాండవ – ఏలేరు అనుసంధానం, నర్సీపట్నం మున్సిపాలిటీలో రూ. 16.60 కోట్లతో రోడ్ల విస్తరణకు శంకుస్ధాపన చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. 2019 ఎన్నికల ప్రచార శంఖారావాన్ని మా నర్సీపట్నంలోనే మీరు ప్రారంభించారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ మూడున్నర ఏళ్ళలో ఎంతో అభివృద్ది చేయడమే కాక, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సుమారు రూ. 1700 కోట్లు మా నర్సీపట్నం నియోజకవర్గానికి ఇచ్చిన ఘనత మీదే, 2019 ఎన్నికల ప్రచారంలో రెండు విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను, మా మున్సిపాలిటీలో పన్నులు ఎక్కువగా ఉన్నాయి, తగ్గించమని కోరాను. టీడీపీ హయాంలో నాడు పన్నుల భారం తగ్గించలేని అసమర్ధ నాయకుడు ఇక్కడున్నాడు, ఐదేళ్ళు మంత్రిగా ఉండి టాక్స్‌ తగ్గించలేని అయ్యన్నపాత్రుడు మళ్ళీ మేం అధికారంలోకి వస్తే 20 శాతం తగ్గిస్తానన్నాడు, కానీ ఇక్కడి ప్రజలు నమ్మలేదు, అతన్ని పక్కన పీకి పడేశారు. మీరు సీఎం అయిన ఏడాదిలో ఇక్కడ 25 శాతం ఇంటిపన్ను తగ్గించిన ఘనత మీది, ఇంకో విషయం కూడా అప్పుడు అడిగాను, ఈ ప్రాంతంలో ఉన్న వంద పడకల ఆసుపత్రిని 150 పడకల ఆసుపత్రిగా మార్చమని కోరాం, కానీ మీరు రూ. 500 కోట్లతో 603 పడకలుగా మార్చే పనికి శంకుస్ధాపన చేశారు. తాండవ ఎత్తిపోతల పథకం వల్ల నర్సీపట్నం, పాయకరావుపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాల రైతాంగం సాగుచేసుకుంటున్నారు. గడప గడప కార్యక్రమంలో ఒకామె వచ్చి నాకు వైయస్సార్‌ చేయూత ద్వారా వచ్చిన మొదటివిడత డబ్బులలో రూ. 10 వేలు వెచ్చించి గేదెను కొన్నాను, ఇది ఇప్పుడు రూ. 70 వేలకు అడుగుతున్నారు, అని ఆమె సంతోషంగా చెప్పింది, అంతేకాదు గడప గడపకు కార్యక్రమంలో అనేకమంది టీడీపీ మహిళలు వచ్చి అన్నా మేం 2019 ఎన్నికల్లో మీకు ఓటు వేయలేదు, స్ధానిక ఎన్నికల్లో కూడా మీకు ఓటు వేయకపోయినా జగనన్న మాకు రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలు ఇచ్చారు, మేం జగనన్నను గుండెల్లో పెట్టుకున్నాం, 2024లో జగనన్నను సీఎంగా చేయడమే కాదు మరో 30 ఏళ్ళ పాటు సీఎంగా ఉండాలని టీడీపీ మహిళలు కోరుకుంటున్నారు. మా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న కొన్ని చిన్న చిన్న సమస్యలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను, అవి పరిష్కరించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను, ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూముల్లో ఏదైనా పరిశ్రమను ఏర్పాటుచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top