చంద్ర‌బాబు కోర్టుల‌ను కూడా తప్పుదోవ ప‌ట్టిస్తున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి పార్థ‌సార‌ధి

రాజ‌ధాని అంశం రాష్ట్ర ప‌రిధిలోనిదే అని కేంద్రం చెప్పింది

అమ‌రావ‌తి శాస‌న రాజ‌ధానిగా ఉండ‌టం బాబుకు ఇష్టం లేదా

ఖ‌ర్చు చేసిన సొమ్ముకు చంద్ర‌బాబు లెక్క‌లు చెప్పాలి

అమ‌రావ‌తిని అన్నివిధాల అభివృద్ధి చేస్తాం

టీడీపీ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నారు

వైయ‌స్ జ‌గ‌న్ ద‌మ్ము..ధైర్యం అంద‌రికి తెలుసు

తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు కోర్టుల‌ను కూడా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి కొలుసు పార్థ‌సార‌ధి విమ‌ర్శించారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ద‌మ్ము, ధైర్యం ఏంటో ప్ర‌జ‌లే నిరుటి ఎన్నిక‌ల్లో 151 సీట్లు ఇచ్చి నిరూపించార‌ని  పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికి అర్ధ‌రాత్రి హైద‌రాబాద్ నుంచి పారిపోయి అమ‌రావ‌తికి వ‌చ్చిన చంద్ర‌బాబు వైయ‌స్ జ‌గ‌న్ గురించి మాట్లాడ‌టం సిగ్గు చేటు అన్నారు. రాజ‌ధాని అంశం రాష్ట్రం ప‌రిధిలోనే ఉంటుంద‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింద‌ని ఆయ‌న తెలిపారు. టీడీపీకి చెందిన రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల‌ను రెచ్చ‌గొట్టి కృత్రిమ ఉద్య‌మాన్ని సృష్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో గురువారం పార్థ‌సార‌ధి మీడియాతో మాట్లాడారు.

బినామీల భూముల కోస‌మే చంద్ర‌బాబు గ‌గ్గోలు..

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో చంద్ర‌బాబు చ‌ప్పుడు చేయ‌లేద‌ని, అమ‌రావ‌తిలో బినామీల భూముల కోస‌మే చంద్ర‌బాబు గ‌గ్గోలు పెడుతున్నార‌ని పార్థ‌సార‌ధి  విమ‌ర్శించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌డావుడిగా టెండ‌ర్లు పిలిచార‌ని తెలిపారు. బాబు హ‌యాంలో భూములిచ్చిన రైతుల‌కు ఒక్క ప్లాట్ కూడా ఇవ్వ‌లేద‌న్నారు. మా ప్ర‌భుత్వం అమ‌రావ‌తి రైతుల‌కు న్యాయం చేస్తుంద‌ని చెప్పారు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌లో కూలీలు ప్ర‌తి ఏటా దూరం ప్రాంతాల‌కు వ‌ల‌స వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర‌ను అభివృద్ధి చేసే దిశ‌గా విశాఖ‌లో ఎగ్జిక్యూటివ్ రాజ‌ధాని పెడితే చంద్ర‌బాబుకు వ‌చ్చిన ఇబ్బంది ఏంట‌ని ప్ర‌శ్నించారు. అంటే అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌టం చంద్ర‌బాబు ఇష్టం లేదా అని ప్ర‌శ్నించారు. అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని చంద్ర‌బాబు గ‌గ్గోలు పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. 

గ‌త ఐదేళ్లు గ్రాఫిక్స్‌తో ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టారు..

గ‌త ఐదేళ్లు గ్రాఫిక్స్‌తో ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు మ‌భ్య‌పెట్టార‌ని పార్థ‌సార‌ధి విమ‌ర్శించారు.  కృష్ణా జిల్లా వాసిగా, ప్ర‌జా ప్ర‌తినిధిగా ఒక్క‌టే చెబుతున్నాను. అమ‌రావ‌తిని రాజ‌ధానిని ఏర్పాటు చేసి చంద్ర‌బాబురియ‌ల్ ఎస్టేట్ అథారిటీగా ఏర్పాటు చేసి , నీ స్వార్థం కోసం, నీ తొత్తుల లాభాపేక్ష‌తోగ్రీన్ జోన్ ఏర్పాటు చేసి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 75 శాతం లే అవుట్లు వేయ‌కూడ‌ద‌ని, ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని ఆదేశించార‌న్నారు. వేల ఎక‌రాలు పేద‌ల నుంచి భూములు లాక్కొన్ని మార్కెట్ చేయాల‌ని చూశార‌న్నారు. రియ‌ల్ ఎస్టేట్ లాభాల కోసం ప్ర‌య‌త్నం చేసింది వాస్తవం కాదా అన్నారు.  అసోసియేష‌న్ ఎగ్జిక్యూటీవ్ క‌మిటీ స‌భ్యుల‌తో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌తో ఉద్య‌మాన్ని న‌డుపుతున్నార‌న్నారు. వేల కోట్లు పెట్టుబ‌డులు పెట్టిన వారు న‌ష్ట‌పోతార‌ని ఉద్య‌మాలు చేస్తున్నారు. డీపీ రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నారు. అమ‌రావ‌తిలో రూ.52 వేల కోట్ల పెట్టుబ‌డులు చూపించ‌గ‌లా అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. ప్ర‌తిప‌క్ష నేత కోర్టుల‌ను కూడా త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోస‌మే వికేంద్రీక‌ర‌ణ‌..
అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని మార్చ‌డం లేద‌ని, అన్ని ప్రాంతాల అభివృద్ధి కోస‌మే వికేంద్రీక‌ర‌ణ చేస్తున్నామ‌ని పార్థ‌సార‌ధి తెలిపారు. అభివృద్ధిని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్య‌మంత్రి క‌ట్టుబ‌డి ఉన్నార‌న్నారు. అమ‌రావ‌తితో పాటు మ‌రో రెండు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి శాస‌న రాజ‌ధానిగా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తి శాస‌న రాజ‌ధానిగా ఉండ‌టం బాబుకు ఇష్టం లేదా అని నిల‌దీశారు.  సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఈ విష‌యంలో ఆలోచ‌న‌లు చేస్తున్నార‌ని చెప్పారు.

చేత‌కాక‌పోతే హుందాగా త‌ప్పుకో బాబూ..

చేత‌కాని ప‌రిస్థితిలో రాజ‌కీయాల నుంచి గౌర‌వంగా త‌ప్పుకోవాలి కానీ, ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టి రాజ‌కీయాలు చేయ‌ల‌నుకోవ‌డం సిగ్గు చేట‌ని పార్థ‌సార‌ధి దుయ్య‌బ‌ట్టారు.  వైయ‌స్ జ‌గ‌న్ ద‌మ్ము, ధైర్యం గ‌త ఎన్నిక‌ల్లో 151 సీట్లు ఇచ్చి ప్ర‌జ‌లే నిరూపించార‌న్నారు. ఏడాది కాలంలోనే అద్భుత‌మైన పాల‌న అందించి ఆయ‌న ధైర్యం చూపించార‌న్నారు. ఆ రోజు ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయి అర్ధ‌రాత్రి హైద‌రాబాద్ నుంచి పారిపోయి అమ‌రావ‌తి వ‌చ్చార‌ని, ఈ రోజు క‌రోనాకు భ‌య‌ప‌డి ఇక్క‌డి నుంచి హైద‌రాబాద్ వెళ్లార‌ని విమర్శించారు. ఆరు నెల‌లుగా ఇంట్లో దాక్కొని పిరికిపంద‌ల బ‌య‌ట‌కు రావ‌డం లేద‌న్నారు. అలాంటి నీవు వైయ‌స్ జ‌గ‌న్ ద‌మ్ము, ధైర్యం గురించి మాట్లాడుతున్నావా అని చంద్ర‌బాబును నిల‌దీశారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డా కూడా గెల‌వ‌లేక‌పోయార‌ని, అజ్ఞాత‌వాసంలో ఉంటూ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌ని పార్థ‌సార‌ధి పేర్కొన్నారు. 

 

Back to Top