ద‌ళితుల సంక్షేమానికి పెద్ద‌పీట‌

ఎమ్మెల్యే మేరుగ నాగార్జున‌

అమ‌రావ‌తి:  దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌ర‌రెడ్డి దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున కొనియాడారు. బుధ‌వారం అసెంబ్లీలో ద‌ళిత సంక్షేమంపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు దళితుల స్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. దళితులను అణగదొక్కే విధంగా టీడీపీ పాలన సాగిందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు పెరిగాయన్నారు.

అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు: ఎమ్మెల్యే గొల్ల బాబూరావు 
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. బడుగుల అభ్యున్నతికి నవరత్నాలను అమలు చేస్తున్నారన్నారు. దళితుల అభివృద్ధి, సంక్షేమానికి సీఎం జగన్‌ కృషి చేస్తున్నారన్నారు. పేదలు అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం అవసరమన్నారు. బడ్జెట్‌లో 45 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. 

నవరత్నాలతో భరోసా: ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి
పేద, బడుగు వర్గాలకు నవరత్నాలతో భరోసా కల్పిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. టీడీపీ నేతలు కోర్టులకు వెళ్లి సంక్షేమ పథకాలకు మోకాలడ్డుతున్నారన్నారు. 

ఎస్సీలకు రాజకీయ ప్రాధాన్యత : ఎమ్మెల్యే డాక్ట‌ర్ తిప్పేస్వామి
ఎస్సీలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దేనని మడకశిర ఎమ్మెల్యే డా.తిప్పేస్వామి అన్నారు. ప్రాధాన్యత ఉన్న పదవుల్లో ఎస్సీలకు అవకాశం ఇచ్చారన్నారు. ఎస్సీ ఉపకులాలకు సైతం సముచిత ప్రాధాన్యత దక్కిందని తిప్పేస్వామి అన్నారు. ఎస్సీ ఉపకులాల గణన చేసి జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశాలు ఇవ్వాలని కోరారు. నామినేటెడ్‌ పోస్టులో కూడా సీఎం జగన్‌ రిజర్వేషన్‌ కల్పిస్తున్నారు. ఎస్సీలను చంద్రబాబు మోసం చేశారు. టీడీపీ హయాంలోఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులను దుర్వినియోగం చేశారని తిప్పే స్వామి అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top