అభివృద్ది, సంక్షేమ పథకాలు కాదు ఆర్థిక సంస్కరణలు 

ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి

అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ది చేసిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నదే

వై ఏపీ నీడ్స్ జగన్ విజయవంతంపై ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం

నెల్లూరు: రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాలుగున్నర సంవత్సరాల్లో ప్రజలకు అందచేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ది పనులు ఆర్థిక సంస్కరణలను, వీటి ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ది సాధించిందని, ప్రతి వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. మంగళవారం మర్రిపాడు మండలం చాబోలు గ్రామంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2019-2023 వరకు చేసిన అభివృద్ది, సంక్షేమ పథకాలను ప్రజలందరికి వివరించే కార్యక్రమం వై ఏపీ నీడ్స్ జగన్ ద్వారా ప్రతి ఇంటికి జగనన్న సంక్షేమాన్ని నాయకులు, కార్యకర్తలు వివరించారని అన్నారు.

ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న ప్రజలందరికి మరోమారు గుర్తు చేయాల్సిన అవసరం ఉందని, 2014లో గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన అభివృద్ది, సంక్షేమం, 2019 నుంచి మన జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులను ప్రజలందరికి వివరించాలని, 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా రానున్న మూడు నెలల కాలంలో అందరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.

జగనన్న 2019లో ప్రవేశపెట్టిన మెనిఫెస్టోలోని ప్రతి హామిని నెరవేర్చారని, ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు ఇలా ప్రతి ఒక్క రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి అభివృద్ది చేశారని అన్నారు.  నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలను అభివృద్ది చేయడంతో 14 శాతం విద్యార్థులు ప్రైవేట్ విద్య నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చారని, డ్రాప్ అవుట్స్ సంఖ్య కూడా భారీగా తగ్గుముఖం పట్టిందని వివరించారు.

పాఠశాలల్లో మరుగదొడ్ల వసతి, జగనన్న గోరుముద్ద, జగనన్న విదేశి విద్య లాంటి పథకాల ద్వారా భవిష్యత్తు తరాలకు విద్యను అందించారన్నారు. విద్యార్థుల చదువుల కోసం రెండు బాషల్లో తెలుగు, ఇంగ్లీషు బాషల్లో విద్యాబోధన జరిగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని అన్నారు. విద్యాభివృద్ది కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 3200 వ్యాధులను చేర్చి అందరిక వైద్యసేవలు అందించేలా మార్పులు చేశారని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి 7 రకాల వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకున్నారని అన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్, ఫ్యామిలి డాక్టర్, 108, 104 ఇలాంటి సంస్కరణలతో  ప్రజలందరికి వైద్యం వారి ముంగిటకే చేరుతుందన్నారు. నూతన ఆరోగ్యశ్రీ కార్డును అందచేస్తూ రూ.25లక్షల వరకు ఖర్చు అయ్యే పలు వ్యాధులకు వైద్యం అందించేలా చూస్తున్నారని అన్నారు. 

రైతు పక్షపాత ప్రభుత్వంగా అందరి మన్ననలు పొందిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తీసుకొచ్చిన సంస్కరణలతో రైతులందరికి ఎలాంటి నష్టం జరగడం లేదని, ప్రతి రైతు ఆనందంగా ఉన్నారని వివరించారు.  ప్రతి గ్రామంలో అందుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ది పనులను పరిశీలించేందుకు గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజాప్రతినిధులను ప్రతి ఇంటికి పంపి ఏమైనా సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించేలా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే లక్ష వరకు సర్టిఫికేట్లు ఈ కార్యక్రమం ద్వారా అందచేయడం జరిగిందని అన్నారు. 

20 ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్న రైతుల అసైన్ మెంట్ పట్టాల ద్వారా శాశ్వత హక్కు కల్పించే కార్యక్రమంతో పాటు, దశాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యలను కూడా పరిష్కరించారని, సాదాబైనామా భూముల కోసం నూతన జీఓను ప్రవేశపెట్టి అర్హులైన రైతులకు భూములను ముఖ్యమంత్రి అందచేస్తున్నారని అన్నారు. 

రెండేళ్లు కరోనా కారణంగా 70 శాతం ఆదాయం తగ్గినప్పటికి ముఖ్యమంత్రి చెప్పిన ఏ సంక్షేమ పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా కొనసాగించిన ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అని, ప్రజల సంక్షేమం, అభివృద్ది సాధించారని, కొంత ఆర్థిక సమస్యలు తలెత్తినప్పటికి నాయకులు, కార్యకర్తలందరూ వెంట నడిచారని, వారందరికి రానున్న ప్రభుత్వంలో జగనన్న అండగా నిలుస్తారని, ప్రతి ఒక్కరూ మరింత ఉత్సాహంతో ఎన్నికలకు సిద్దం కావాలని మేకపాటి విక్రమ్ రెడ్డి పిలుపునిచ్చారు.

Back to Top