జాలి కోసం చంద్రబాబు జోలె పడుతున్నారు

ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డు

మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం

ఎమ్మెల్యే కరుణం ధర్మశ్రీ

చంద్ర‌బాబు జోలె ప‌ట్టి ర‌క‌ర‌కాల విన్యాసాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే క‌రుణం ధ‌ర్మ‌శ్రీ విమ‌ర్శించారు. ఆయ‌న సోమ‌వారం తాడేప‌ల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాల‌యంలో విలేక‌రుల‌తో మాట్లాడారు. జోలెప‌ట్టి జాలికోసం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఐకాస అని పేరు పెట్టి ఆడుతున్న నాట‌కాల‌ను ప్ర‌జ‌లు తీక్ష‌ణంగా గ‌మ‌నిస్తున్నారు. ఉత్త‌రాంధ్ర అభివృద్ధిని చంద్ర‌బాబు నాయుడు అడ్డుకుంటున్నార‌ని చెప్పారు. ఉత్త‌రాంధ్ర‌, రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల పాట్లు టీడీపీకి క‌నిపించ‌డం లేదా? అక్క‌డి ప్ర‌జ‌లు మీకు ఓట్లు వేయ‌లేదా? అక్క‌డ మీకు ప్లాట్లులేవ‌నా? అని ప్ర‌శ్నించారు. ఉత్త‌రాంధ్ర అన్నా, రాయ‌ల‌సీమ అన్నా ఎందుకు క‌డుపు మంట అని ధ‌ర్మ‌శ్రీ అన్నారు. అక్క‌డి అభివృద్ధికి అడ్డం వ‌స్తే రాజ‌కీయంగా మిమ్మ‌ల్ని పాతిపెట్టేందుకు సిద్ధ‌మ‌న్నారు. వెన‌క‌బ‌డిన రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల బతుకులు నాశ‌నం చేయ‌డానికే చంద్ర‌బాబు నాయుడు జోలె ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు. రాత్రిపూట ఫొటోలు తీసి ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెట్టేందుకు ఎల్లోమీడియా ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరోపించారు. తెలుగు ప్ర‌జ‌లు తెలివైన‌వార‌ని, వాటి ఉచ్చులో ప‌డ‌ర‌ని చెప్పారు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిల‌కు ఎందుకు ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ‌ల‌పై అక్క‌సు అన్నారు. 40 సంవ‌త్స‌రాల అనుభ‌వం ఉన్న వ్య‌క్తి ఎందుకు ముంపు ప్రాంతాన్ని రాజ‌ధానిగా ఎంపిక చేశారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. రాజ‌ధాని టాపిక్‌ను ప‌ట్టుకుని రాష్ట్రాన్ని రావ‌ణ కాష్టం చేయ‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు.
మూడు ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధే జ‌గ‌న్ ధ్యేయం..
మూడు ప్రాంతాల స‌మ‌గ్ర అభివృద్ధే జ‌గ‌న్ ధ్యేయ‌మ‌ని రంప‌చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌రుణం ధ‌ర్మ‌శ్రీ అన్నారు. ఏపీ అభివృద్ధికి జ‌గ‌న్ గ‌ట్టి కృషి చేస్తోంటే చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు చేస్తున్న కుటిల ప్ర‌య‌త్నాల‌ను ప్ర‌జ‌లు తిప్పి కొడ‌తార‌ని చెప్పారు. విశాఖ రాజ‌ధానిగా వ‌స్తే నిధుల కొర‌త ఉండ‌ద‌ని పేర్కొన్నారు. విశాఖ రాజ‌ధానిగా వ‌స్తే ఉత్త‌రాంధ్ర, రాయ‌ల‌సీమ‌ల‌కు ప‌ట్టిన శ‌ని వ‌దులుతుంద‌ని తెలిపారు. వాటికి నిధుల వ‌ర‌ద పారుతుంద‌నన్నారు. అమ‌రావ‌తి నుంచి త‌ర‌లించ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. అమ‌రావ‌తిలో పోరాటం చేస్తున్న‌ట్లు చెబుతున్న‌వారికి క‌నీసం అక్క‌డ ఇళ్లు కూడా లేవ‌ని విమ‌ర్శించారు. నారాయ‌ణ‌, రామ‌కృష్ణ‌, నాదెండ్ల భాస్క‌ర్‌లు ఎక్క‌డి నుంచి వస్తున్నార‌ని ప్ర‌శశ్నంచారు. ఖ‌ర్ఛుత‌గ్గ‌తుంద‌నే విశాఖ‌లో సెక్ర‌టేరియేట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు. చంద్ర‌బాబు చేస్తున్న ర‌గ‌డ వ‌ల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చీలిక తెచ్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు.

 

తాజా వీడియోలు

Back to Top