పల్నాడు: బీసీలతో సహా అందరికీ సామాజిక న్యాయం చేస్తోంది వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పిడుగురాళ్ల, అయ్యప్పనగర్ బైపాస్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రసంగించారు. ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఏమన్నారంటే.. తెలుగుదేశం నాయకులు అంటున్నారు మా దగ్గర డబ్బుంది మీ దగ్గర ఏముంది అని అడుగుతున్నారు. నేను చెప్పా.. వాస్తవమే. మీ బాబుగారు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఇచ్చాడు మీకు కానీ మా జగన్ మోహన్ రెడ్డి గారు మాకు దమ్ము ఇచ్చాడు. 5 సంవత్సరాల క్రితం ఇంటింటికీ పోయాం, గడపగడపకు పోయాం. ఒకటే చెప్పాం ఒక్క అవకాశం జగన్ మోహన్ రెడ్డి గార్కి ఇవ్వండి ఆంధ్రరాష్ట్రం రూపురేఖలు మార్చి చూపిస్తాడని చెప్పాం. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత మనం చూస్తున్నాం పాలనా సౌలభ్యం కొరకు సచివాలయాలు, వాలంటీర్లను తీసుకొచ్చి. ఆరోజు మారుమూల గ్రామాల నుంచి ఎవరైనా సరే మండల హెడ్ క్వార్టర్ కు పోయి కుల ధృవీకరణ పత్రాలు, పట్టాలు, పెన్షన్లు గానీ హాయిగా ఈరోజు వారి గ్రామాల్లోనే సచివాలయాలు ఏర్పాటు చేసి ఎవ్వరూ మండల హెడ్ క్వార్టర్ కు పోకుండా చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు. పెన్షన్ కొరకు గంటలు గంటలు వేచి చూసేది లేకుండా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఇంటికీ పెన్షన్ వచ్చేటట్టు చేస్తోంది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. కేవలం పాలనా సౌలభ్యమే కాదు, సంక్షేమం ఈరోజు నవరత్నాల ద్వారా దాదాపు 80 శాతం మంది ప్రజలకు రూ.2 లక్షల కోట్లు ప్రతి ఇంటికీ రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు వచ్చేటట్టు ఈ ఐదు సంవత్సరాలలో వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేటట్టు చేయూత గానీ, ఆసరా గానీ, అమ్మఒడి గానీ విద్యాదీవెన, వసతిదీవెన, ఆరోగ్యశ్రీ, రైతుభరోసా, కరోనా అనే మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పేదవాడు తన కాళ్ల మీద నిలబడేటట్టు చేశాడు జగన్ మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈరోజు గురజాల నియోజకవర్గం తీసుకోండి.. రూ.1,964 కోట్లతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, జలదీక్ష పేరుతో రూ.218 కోట్లతో పిడుగురాళ్ల, దాచేపల్లి, గురజాలతో సహా 57 గ్రామాలకు ఈరోజు నీళ్లు ఇస్తున్నాం. త్వరలోనే టెండర్లు పూర్తవుతాయి. గురజాల, దాచేపల్లితో సహా మిగతా 40 గ్రామాలు ప్రతి వీధికీ పైప్ లైన్ వేసి, ప్రతి ఇంటికీ కుళాయి బిగించి, నాడు నాగార్జునసాగర్ కట్టి కృష్ణమ్మ పరవళ్లు తొక్కిన కాసు బ్రహ్మానందరెడ్డి మనవడిగా చెబుతున్నా, జగనన్న సైనికుడిగా చెబుతున్నా ప్రతి ఇంటికీ నీళ్లిస్తాం ఒక్క సంవత్సరంలో. అలాగే కనీసం డిగ్రీ కాలేజీ, మెడికల్ హాస్పిటల్ లేని గురజాల నియోజకవర్గంలో రూ.500 కోట్లతో ఈరోజు 600 పడకల హాస్పిటల్, మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ తీసుకొచ్చాం. త్వరలోనే ఇంజినీరింగ్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ కూడా నెలకొల్పబోతున్నాం. జానపాడు బ్రిడ్జి శాంక్షన్ చేయించాం, పిడుగురాళ్ల బ్రిడ్జి, పిడుగురాళ్ల బైపాస్ పూర్తి చేశాం. దాచేపల్లి నుంచి మాచర్ల వరకు రూ.400 కోట్లతో జాతీయ రహదారి పూర్తిచేసి ఈరోజు బ్రహ్మాండంగా విరాజిల్లేట్టు చేశాం. 900 సంవత్సరాల చరిత్ర కలిగిన దాచేపల్లి, గురజాలను పట్టణాలు చేశాం. బీసీలతో సహా అందరికీ సామాజిక న్యాయం చేస్తోంది జగన్ మోహన్ రెడ్డి గారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో మొట్టమొదటసారి నరసరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను పార్లమెంట్ కు పంపడానికి జగన్ మోహన్ రెడ్డి గారు కాదా. తెలుగుదేశం 40 సంవత్సరాల్లో బీసీకి ఒక ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్సీ గానీ, ఒక ఎంపీ గానీ ఏరోజైనా ఇచ్చారా ఆలోచించండి సోదరులారా ఒప్పుకుంటా. అనంత వాయువుల్లో రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నారు, వెన్నుతట్టి ప్రోత్సహించే జగన్ మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చేయి పట్టుకుని నడిపించే కార్యకర్త ఉన్నాడు, ఆదరించి అభిమానించే జనం ఉన్నారు అరె..నెత్తురుంది, ఊపిరింది, సత్తువుంది ఇంతకన్నా సైన్యం కావాలా ఈరోజు యుద్ధం చేయడానికి.