ఘన చరిత్ర ఉన్నా ..అభివృద్ధిలో వెనుకబడిపోయాం

గత ప్రభుత్వం తాగునీటి  ప‌థ‌కాల‌ను నీరుగార్చింది..

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే  కాసు మహేష్‌రెడ్డి

అమరావతిః ఎంతో చరిత్ర కల్గిన గురజాల,దాచేపల్లి గ్రామాలను మున్సిపాల్టీలు చేయాలని ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి కోరారు. ఆయన సొమవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. 850 ఏళ్ల ఘన చరిత్ర ఉన్నా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయాయమని ఆవేదన వ్యకం  చేశారు.  వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి,కాసు బ్రహ్మనందరెడ్డిలు ముఖ్యమంత్రులుగా  ఉన్న‌ప్పుడు మాత్ర‌మే మా ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలిపారు. రూ.4వేల కోట్లతో నాగార్జున సాగర్‌ కాలువ ఆధునీకరణ జరిగిందన్నారు. వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురజాల నియోజకవర్గంలో మెడికల్‌ కళాశాల మంజూరు చేశారన్నారు.

 నియోజకవర్గంలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు.దివంగత మహానేత వైయస్‌ఆర్‌ రూ.90 కోట్లతో ప్రవేశపెట్టిన మంచినీటి పథకాలను కూడా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఒక పథకం కూడా సక్రమంగా పనిచేయడం లేదన్నారు.8 లక్షల జనాభా ఉన్న గురజాల,మాచర్ల నియోజకవర్గాల్లో సరైన ఆసుప్రతి కూడా లేదన్నారు.వైద్యం చేయించుకోవాలంటే  దూరంలో ఉన్న గుంటూరు,నరసరావుపేట ప్రాంతాలకు వెళ్ళాల్సివస్తుందన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి కళాశాల కూడా లేదన్నారు

Back to Top