జిల్లాల పునర్విభజన సంతోషదాయకం

శింగనమల ఎమ్మెల్యే  జొన్నలగడ్డ పద్మావతి  
 

అనంత‌పురం: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగానే జిల్లాల పునర్విభజన ప్రక్రియను చేపట్టి ఆదిశగా ముందడుగు వేయడం ఎంతో సంతోషదాయకమని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. ఈ నేపథ్యంలో  బుక్కరాయసముద్రం  మండల కేంద్రంలో సొసైటీ ఆవరణంలో ఉన్న మహానేత వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి, కూడలిలో ఉన్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సొసైటీ ఆవరణం దగ్గర నుంచి పంచాయతీ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి  ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ..జిల్లాల పునర్విభజన వల్ల ప్రజలకెంతో మేలు కలుగుతుందని అన్నారు. ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే ఇంతకుముందు ఎంతో దూరభారంగా వెళ్లేవాళ్లు. అలాగే ఒక ఉన్నతాధికారి కలెక్టరు లాంటివారిని కలవాలన్నా ఒక పట్టాన అయ్యేది కాదు. అదే ఇప్పుడు చిన్న జిల్లాల వల్ల అధికారులు అందుబాటులో ఉంటారు. వారిని కలవడం, మన సమస్యలని విన్నవించుకోవడం సులువుగా ఉంటుంది. అలాగే వారు వెంటనే పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.

Back to Top