చంద్ర‌బాబును ప్రాసిక్యూట్ చేయాలి 

ఎమ్మెల్యే  జొన్న‌ల‌గ‌డ్డ‌ ప‌ద్మావ‌తి
 

అమ‌రావ‌తి:  మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును ప్రాసిక్యూట్ చేయాల‌ని ఎమ్మెల్యే జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి అన్నారు. స‌భ‌లో ఆమె మాట్లాడుతూ..
మ‌హిళా సాధికార‌త గురించి కేవలం ప్ర‌సంగాల్లో మాత్ర‌మే ఇంత‌కాలం విన్నాం. చ‌ట్ట స‌భ‌ల్లో 33 శాతం రిజ‌ర్వేష‌న్ కోసం మ‌హిళ‌లింకా పోరాడుతూనే ఉన్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కొత్త‌గా ఏర్ప‌డిన ఒక పార్టీ దేశ చ‌రిత్ర‌లోనే ఎక్క‌డా లేని విధంగా అమ్మొడి ప‌థ‌కం ద్వారా  43 ల‌క్ష‌ల త‌ల్లుల‌ను ఆదుకుని, ఫీజ్ రీయంబ‌ర్స్ మెంట్ 20000 హాస్ట‌ల్ ఎక్స్ పెన్సెస్ ఇవ్వ‌డం కానీ ముదావ‌హం.
చ‌దువుల భారం మోయ‌లేక చాలామంది ఇళ్ల‌లో ఆడ‌పిల్ల‌ల‌ను చ‌దువులు మాన్పించేస్తున్నారు. ముఖ్య‌మంత్రి గారి చ‌ల‌వ వ‌ల్ల అమ్మ ఒడి, ఫీజ్ రీయంబ‌ర్స్మెంట్, హాస్ట‌ల్ ఎక్స్ పెన్సెస్ లు అందుకుని ఆడ‌పిల్ల‌లు చ‌దువుకోగ‌లుగుతారు. త‌ల్లితండ్రులు ఆడ‌పిల్ల‌ల చ‌దువు భారం అనుకోకుండా నిరంభ్యంత‌రంగా చ‌దివించ‌గ‌లుగుతారు. డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఉన్న అప్పు నాలుగు ద‌ఫాల్లో తీర్చ‌డం, సున్నా వ‌డ్డీకే రుణాలు అందించ‌డం, 45 సం.లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మ‌హిళ‌ల‌కు 75000 ఆర్థిక సాయం అందించ‌డం, కాంట్రాక్టులు, స‌ర్వీస్ కాంట్రాక్టుల్లో మ‌హిళ‌ల‌కు స్థానం క‌ల్పించ‌డం ద్వారా మ‌హిళ‌ల‌కు ఆర్థీక‌, సామాజిక న్యాయం అందిస్తున్నారు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.  టీడీపీ హామీల్లో 14000 డ్వాక్రా రుణాల‌ను మాఫీ అన్న‌ది రెండొవ‌ది. దాన్నీ వాళ్లు పూర్తిగా విస్మ‌రించారు. ఏ గ్రేడ్ బీ గ్రేడ్ సీ గ్రేడ్ సంఘాల‌న్నిటినీ మ‌భ్య‌పెట్టారు. అగ్రి గోల్డు స్కాం, కృషి బ్యాంక్ స్కామ్ మాదిరిగానే టీడీపీ చేసిన అబ‌ద్ద‌పు హామీలను కూడా విచార‌ణ చేసి, చంద్ర‌బాబును ప్రాసిక్యూట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. 

Back to Top