టీడీపీ ఎమ్మెల్యేలు ఓడిపోతార‌ని బాబుకు భ‌యం

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి జోగి ర‌మేష్‌

విజ‌య‌వాడ‌: చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో దాక్కొని స‌వాలు విసురుతున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి జోగి ర‌మేష్ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు మాకు స‌వాలు విస‌ర‌డం కాద‌ని, మేమే స‌వాలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబుకు ద‌మ్ముంటే త‌న ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాల‌ని  జోగి ర‌మేష్ చాలేంజ్ చేశారు. ఉప ఎన్నిక‌ల్లో త‌న ఎమ్మెల్యేలు ఓడిపోతార‌ని చంద్ర‌బాబు భ‌య‌ప‌డుతున్నార‌న్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిని ఎక్క‌డికి త‌ర‌లించ‌డం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అమ‌రావ‌తికి అద‌నంగా మ‌రో రెండు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేయాల‌న్న‌దే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆలోచ‌న అని ర‌మేష్ తెలిపారు. 

తాజా వీడియోలు

Back to Top