విశాఖకు గుర్తింపు తెచ్చిన సీఎంకు ధన్యవాదములు

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌
 

అసెంబ్లీ మీడియా పాయింట్‌: విశాఖపట్టణాన్ని ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ఏర్పాటు చేసి గుర్తింపు తెచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ధన్యవాదములు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు.  మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు పూర్తిగా స్వాగతిస్తూ..ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్‌ మన్ననలు పొందుతున్నారు. ఇటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్న వైయస్‌ జగన్‌ విశాఖకు గుర్తింపు తీసుకువచ్చారు. నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఉత్తరాంధ్రకు విశాఖ ముఖద్వారం. అనేక దశాబ్ధాలుగా ప్రజలు అభివృద్ధికి నోచుకోక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. హైదరాబాద్‌, చెన్నై, బెంగూళూరు వంటి ప్రాంతాలకు అందరిని వదిలి పొట్టకూటి కోసం వెళ్తున్నారు. ఈ రోజు విశాఖకు ఒక మహర్దశ రాబోతుంది. విశాఖ రాజధాని భూముల రాజధాని కాదు..ఉద్యోగుల రాజధాని, సంస్కృతి, సంప్రాదాయలు కలగలసిన రాజధాని. అన్ని రంగాల్లో విశాఖ ముందుంది. అనేక వర్గాలు, కులాలు, అనేక రాష్ట్రాలకు చెందిన వారు అక్కడ నివసిస్తున్నారు. విశాఖకు గుర్తింపు తెచ్చిన వైయస్‌ జగన్‌కు ధన్యవాదలు తెలియజేస్తున్నాను.

Back to Top