చంద్రబాబు గొడ్డుకంటే హీనం

పిచ్చికుక్కలా సమాజంపై పడి మాటలతో కరుస్తున్నాడు

నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడవడమే చంద్రబాబు నైజం

సీఎం వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే ఊరుకోం

టీడీపీకి తెలంగాణలో పట్టిన గతే.. ఏపీలో పడుతుంది

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌

 

తాడేపల్లి: మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అని పెద్దలు అన్నారని, చంద్రబాబు గొడ్డు కంటే హీనమైన వాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. సమాజంపై పిచ్చికుక్కలా పడి మాటలతో కరుస్తున్నాడని మండిపడ్డారు. 2019లో చెప్పుదెబ్బలా ఓటమిని చూపించి 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా బుద్ధిరాలేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత దూషణలు చేస్తే ఊరుకునేది లేదని చంద్రబాబును హెచ్చరించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు ప్రజల దగ్గరకు వెళ్లి నేను మారిన మనిషిని అని చెప్పాడు.  600 వాగ్దానాలు ఇచ్చి ప్రజలను అడ్డగోలుగా దగా చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాడు. ఐదేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. చంద్రబాబు గొడ్డు కంటే హీనం. ఇటువంటి వ్యక్తికి ప్రజలు చెప్పుదెబ్బలాంటి ఓటమిని చూపించి 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశారని బాబు గుర్తించుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు స్పెషల్‌ స్టేటస్‌ గురించి, ప్రత్యేక హోదా గురించి ఎలా మాట్లాడాడు. రాష్ట్రాన్ని విడగొట్టడమే అన్యాయం అని ఇక్కడు.. తెలంగాణకు వెళ్లి ఈ రాష్ట్రం రావడానికి నేను మూడు లేఖలు ఇచ్చానని మాట్లాడాడు. మండలి విషయంలో కూడా 2004లో ఒకలా.. ఇప్పుడు ఒకలా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ద్వంద్వ వైఖరిని సీఎం వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో వీడియోలు వేసి మరీ రాష్ట్ర ప్రజానీకానికి చూపించారు.

చంద్రబాబు మాట్లాడే మాటకు నిబద్ధత, నీతి లేదు. నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారాన్నే కాకుండా.. పార్టీని కూడా లాక్కున్నాడు. ప్రజలు అనేక సార్లు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు రావడం లేదు. పిచ్చికుక్కలా సమాజం మీద పడి మాటలతో కరుస్తున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ తన తండ్రిని కొడుతున్నారని వైయస్‌ విజయమ్మ రోశయ్యతో చెబితే.. రోశయ్య వచ్చి చంద్రబాబుకు చెప్పాడంట. చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నాడు. రైతులు బషీర్‌బాగ్‌లో ధర్నా చేస్తుంటే పిట్టల్ని కాల్చినట్లుగా కాల్చింది చంద్రబాబు. అంగన్‌వాడీ టీచర్లను లాఠీలతో కొట్టించి, గుర్రాలతో తొక్కించి చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబు. పేదలు ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం వస్తే ప్రభుత్వ సొమ్ము ఊరికే దారపోస్తామా..? యూజర్‌ చార్జీలు వసూలు చేసిన నీచుడు చంద్రబాబు. 2019లో ఎన్నికల్లో చెప్పుతో కొట్టినట్లుగా తీర్పు ఇచ్చినా బుద్ధి రావడం లేదు. ఈ రోజున ఎదురుగుండా కనిపిస్తే చెప్పుతో కొట్టాలనిపిస్తుంది. కొడుకును కూడా గెలిపించుకోలేకపోయాడు. కానీ, దొడ్డిదారిన శాసనమండలిలోకి తీసుకువచ్చాడు.  

సీఎం వైయస్‌ జగన్‌ గొప్ప నిర్ణయాలు తీసుకువస్తూ ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రాత్మకమైన బిల్లులే కాకుండా.. నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను అభివృద్ధి చేయడం, అమ్మ ఒడి ద్వారా ప్రతి పిల్లవాడిని స్కూల్‌కు పంపించే కార్యక్రమం, ప్రతి రైతులకు రైతుభరోసా ద్వారా రూ.13500, ఇంగ్లిష్‌ మీడియం, మేనమామలా సీఎం వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ద్వారా పిల్లలకు కంటి పరీక్షలు చేయిస్తున్నారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ప్రజల అభిమానాన్ని పొందుతుంటే తట్టుకోలేక చంద్రబాబు దుర్మార్గాలకు పాల్పడుతున్నాడు. ఎన్టీఆర్‌ మద్యపాన నిషేధాన్ని చంద్రబాబు తూట్లు పొడిచాడు. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తున్నారు. గాంధీజీ కలలు కన్నట్లుగా గ్రామస్వరాజ్యం కోసం గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని గడప దగ్గరకు తీసుకెళ్తున్న మహానాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. ఇటువంటి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక పిచ్చికుక్క మాదిరిగా ఈ సమాజం మీద పడి ప్రవర్తిస్తున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా నీ మాట తీరు మార్చుకో అని సూచించారు. వైయస్‌ జగన్‌ గురించి వ్యక్తిగతంగా దూషించేందుకు వైయస్‌ విజయమ్మ, రోశయ్యలను తీసుకువచ్చి మాట్లాడుతున్నావంటే.. నువ్వు ఎంత దిగజారిపోయావనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణలో పట్టిన గతే ఏపీలో కూడా పడుతుంది.

Back to Top