లైనింగ్‌ పనులు పూర్తి చేయాలి

ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథ్‌రెడ్డి(నాని)
 

అసెంబ్లీ: తెలుగు గంగ లైనింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే గంగుల బీజేంద్రనాథ్‌రెడ్డి కోరారు. మంగళవారం సభలో ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ నియోజకవర్గం వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఒకపక్క తెలుగుగంగ, కేసీ కెనాల్‌పై ఆధారపడ్డాయి. ఒక్క పరిశ్రమ కూడా లేదు. రిజర్వ్‌ ఫారెస్టు ఉంటుంది. గత ఐదేల్లుగా వర్షాలు లేక పంటలు పండలేదు. ఇప్పుడు దేవుడి దయ వల్ల వర్షాలు కురిశాయి. తెలుగు గంగ కేనాల్‌కు 5 వేల క్యూసెక్కులు పరించేందుకు రూపొందించినా కేవలం 3500 మాత్రమే పారిస్తున్నారు. ఇంకా 20 శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలి. లైనింగ్‌ పనులు పూర్తి చేయాలి.

Back to Top