అభివృద్ధి నిరోధక వ్యవస్థ మనకు అవసరమా?

వైయస్‌ఆర్‌సీపీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతిచ్చారు

ప్రజాస్వామ్యంలో ఈ తీర్పు అరుదైనది

ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ అడ్డుకుంటోంది

బ్రిటీషర్లు స్వార్థ ప్రయోజనాల కోసం పెద్దల సభను ఏర్పాటు చేశారు

మహాత్మాగాంధీ ఆ నాడే పెద్దల సభను వ్యతిరేకించారు

పెద్దల సభ తాత్కాలికమే అని ఆ రోజే అంబేద్కర్‌ చెప్పారు

మండలి అవసరం లేదని గతంలో చంద్రబాబు కూడా చెప్పారు

రాజకీయ కారణాలతో చట్టాలు అలస్యమవుతున్నాయి

సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

అసెంబ్లీ: శాసన మండలి వంటి అభివృద్ధి నిరోధక వ్యవస్థ మనకు అవసరమా అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. గతంలో మంత్రిగా ఉన్న నారా లోకేష్‌ను మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే..మండలిలో లోకేష్‌ ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. ఎగువ సభలు అవసరం లేదని మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వంటి నేతలు ఆ రోజే అభిప్రాయపడ్డారని తెలిపారు. శాసన మండలి తీర్మానంపై ధర్మాన అసెంబ్లీలో మాట్లాడారు. 
సభా నాయకులు వైయస్‌ జగన్‌ ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు. ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి చాలా అంశాలను, స్వాంతంత్ర్యం ముందు తరువాత మేధావుల అభిప్రాయాలను పరిశీలించాను. మండలి రద్దు అంశం ఒక్కటే కాదు..మొన్న ఏం జరిగింది. ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో వైయస్‌ జగన్‌ నాయకత్వంలో వైయస్‌ఆర్‌సీపీకి ప్రజలు 51 శాతం మద్దతుగా నిలిచారు.  ఇది అరుదైన తీర్పు. ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన తీర్పు. వైయస్‌ జగన్‌ అంతకుముందు రాష్ట్రంలో అధ్యయనం చేశారు. అన్ని ప్రాంతాల అభిప్రాయాలను తెలుసుకొని, అన్ని ప్రాంతాల లోపాలను తెలుసుకున్నారు. ప్రజల ఆవేదన తెలుసుకొని వచ్చిన నాయకుడు వైయస్‌ జగన్‌. ఈ ప్రభుత్వం ఆరు మాసాల్లో అనేక చట్టాలు తెచ్చింది. ఈ సభలో మూడు చట్టాలు చేస్తే..మండలిలో బ్రేక్‌ వేశారు. అత్యున్నతమైన ప్రజల తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అంతిమంగా ప్రజాస్వామ్య సారాన్ని మనం వ్యతిరేకించినట్లే. ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది. ఐదేళ్ల తరువాత ప్రభుత్వం మళ్లీ ప్రజల వద్దకు వెళ్తుంది. అలాంటి అవసరం ఉన్న ప్రభుత్వానికి, ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తుంటే దొడ్డిదారిన వచ్చిన వారు, ప్రజల చేత తిరస్కరించిన టీడీపీ ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తే ప్రజల తీర్పును వ్యతిరేకించినట్లే కదా?
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అమలులో ఉన్న దేశాలు178 ఉంటే..
 కేవలం 68 దేశాల్లో మాత్రమే ఇలాంటి ఎగువ సభలు ఉన్నాయి. రద్దు చేశారే తప్ప..కొత్తగా తీసుకువచ్చింది పెద్దగా లేదు. ఈ సభలకు ఆజ్యం పడిందంటే..మనకు స్వాతంత్య్రం  రాకముందు బ్రిటిష్‌ పాలనలో మనకు 9  ఎగువ సభలు ఏర్పాడ్డాయి. బ్రిటిష్‌ వాళ్లు ఎందుకు చేశారంటే..వాళ్ల లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ సభలు ఏర్పాటు చేశారు. పెద్దలను గౌరవిస్తూనే దేశానికి కన్నం పెట్టే పని చేశారు. అందుకే మహాత్మాగాంధీ 1937,  సెప్టెంబర్‌ 31న లండన్‌లో వ్యతిరేకించారు. మనకు జాతీపిత అయిన గాంధీజీ ఆ నాడే చెప్పారు. ఇది మనకు కరెక్ట్‌గా సరిపోయే సందర్భం. కేవలం బ్రిటిష్‌వాళ్లు గమ్మత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆ రోజే గాంధీజీ పసిగట్టారు. కాబట్టి వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ఎన్నికల్లో గెలవలేక పరాజయం పొందిన వారికి ఈ సభలు పునరావాస కేంద్రంగా మారింది.  రాజకీయ కారణాలతో ప్రజలకు ఉపయోగకరమైన చట్టాలు చేసేందుకు శాసన సభ ఉపయోగపడుతుంది. మండలికి ఐదేళ్లలో రూ.300 కోట్లు ఖర్చు అవుతుంది. అలాంటి మండలి ఈ సభ తీసుకున్న నిర్ణయాలను అడ్డుకుంటుందే..ఇలాంటి సభ మనకు అవసరమా? కాబట్టి ఆలోచన చేయాలి. ఇది వందశాతం రుజువైంది. అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని రచించేందుకు కాన్‌స్టెంట్‌ అసెంబ్లీ ఏర్పాటు చేశారు. దీనికి బీఆర్‌ అంబేద్కర్‌ను అధ్యక్షుడిగా చేశారు. ఇది తాత్కాలికమే అని అంబేద్కర్‌ ఆరోజే చెప్పారు. ప్రజల చేత తిరస్కరించిన వ్యక్తులు గ్యాలరీలో కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మంచి ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేది ఈ సభ. పడగొట్టాలని ఎత్తుగడలు వేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా?. సెలెక్ట్‌ కమిటీ కూడా పద్ధతి ప్రకారం వేయలేదు. మండలిలో అప్రజాస్వామికంగా వ్యవహరించారు. ఎస్సీ, ఎస్టీల కోసం, విద్యాకు సంబంధించిన బిల్లులను మండలి తిరస్కరిస్తే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుంది కదా?. ఈ సభల గురించి ఎవరూ కూడా సమర్ధించి మాట్లాడటం లేదు. గొప్పవాళ్లే ఈ పెద్దల సభను వ్యతిరేకించారు. బ్రిటీషర్ల నాటి ఆరు సభలు దేశంలో ఉన్నాయి.  శాసన సభలోకి బాగా చదువుకున్న వారు వస్తున్నారు.  ఇదే సభలో మార్పులు చేసే అవకాశం ఉంది.  మనం గొప్ప దేశభక్తులు అనుకుంటున్న వ్యక్తులు ఆ రోజే ఈ ఎగువ సభలు అవసరం లేదని చెప్పారు. దానికి అనుగుణంగా ఈ తీర్మానం ఉందని భావిస్తున్నాను. ఆ సభలో ఉండే చైర్మన్‌ రూల్స్‌ వక్రీకరించి నిర్ణయం తీసుకున్నారు. దిగువ సభ ఆమోదిస్తే ఎగువ సభ ఆమోదిస్తే గొప్ప ఏముంటుందని ఆ రోజు ప్రెంచ్‌ ఫిలాసర్‌ అన్నారు. తిరస్కరిస్తేనే ముప్పు వాటిల్లుతుంది. 
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఆరు రాష్ట్రాల్లో మాత్రమే మండలి ఉంది. మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేవు. మనది పోతే ఇక ఐదు రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది. ఆ రాష్ట్రాల్లో ఏం కొంపలు మునిగిపోలేదు. అందుకోసం దీనిపై ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 69లో ఒక రాష్ట్రంలో ఎగువ సభ రద్దు చేయాలన్నా..ఏర్పాటు చేయాలన్నా పార్లమెంట్‌లో బిల్లు పెట్టి చట్టం చేయాల్సిన అవకాశం ఉంటుంది. నెహ్రూ ఇవన్నీ చూసిన తరువాత చాలా సీరియస్‌గా మధనపడేవారట. ఒకసారి పంజాబ్‌ ముఖ్యమంత్రికి ఒక ఉత్తరం రాశారట. ఎన్నికల తరువాత ఎగువ సభను ఎత్తేద్దామని లేఖలో పేర్కొన్నారట. ఇదే సభలో ఈ ప్రాంతంలోని ప్రజలే చంద్రబాబు కుమారుడిని ఎమ్మెల్యేగా తిరస్కరిస్తే..ఆయన మండలిలో కూర్చొని ఇది తప్పు..అది తప్పు అని చెబుతున్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసినట్లు అవుతుంది. మంగళగిరిలో ప్రజలు లోకేష్‌ను ఓడించారు కదా?. ప్రజల తీర్పును దెబ్బకొట్టేందుకు చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని ప్రభావితం చేస్తున్నారు. నెహ్రూ మళ్లీ 23 అక్టోబర్‌ 1955లో ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికీ 8 రాష్ట్రాల్లో మాత్రమే ఎగువ సభలు ఉండేవి.  దొడ్డిదారిలో వచ్చిన వారు ఇలా చట్టాలకు అడ్డుపడకూడదన్నారు. చంద్రబాబు మొహం చూపించలేక సభకు రాలేదు. మండలి అవసరం లేదని చంద్రబాబే అన్నారు. అంతకుముందే మహాత్మాగాంధీ, నెహ్రూ, అంబేద్కర్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కాబట్టి..గాంధీజీ చెప్పిన మార్గంలోనే నడుద్దాం. ఈ మండలిని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ..ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నాను.

 

Back to Top