ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలి

నిన్న మండలి చైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారు

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేసిన నిర్ణయాలను అడ్డుకుంటే వారిని అవమానించినట్లే

ప్రజలచే ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వ నిర్ణయాలను మండలి ఆపలేదు

గతంలో వ్యవస్థలను మేనేజ్‌ చేసినట్లుగా, ప్రజలను మోసం చేసినట్లుగానే నిన్న బాబు చైర్మన్‌ను ప్రభావితం చేశారు

ఎన్టీ రంగా కూడా మండలి అవసరం లేదన్నారు

ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు

అసెంబ్లీ: శాసన మండలి వ్యవహారాలపై ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచించాలని సీనియర్‌ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. అనేక అధ్యయనాల తరువాత వికేంద్రీకరణ బిల్లు తయారైంది. ఇలాంటి బిల్లును అడ్డుకోవడం అంటే ప్రజాభిప్రాయాన్ని అడ్డుకున్నట్లే అన్నారు. పెద్దల సభ అంటే సలహాలు, సూచనలు ఇచ్చి బిల్లును ఆమోదించాలి. గురువారం సభలో ధర్మాన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ఎన్నికైన ప్రభుత్వాలు ఘోరాలు, పాపాలు చేస్తే..ప్రజలు నిస్సహయులుగా ఉండిపోకూడదన్నది నా వాదన. అప్పుడే వ్యవస్థపై నమ్మకం వస్తుంది. అందరు నిస్సహయ స్థితికి వెళ్లిపోవడానికి ఒక పార్టీ కాకూడదు. నా అభిప్రాయం ప్రకారం ఇంతకుముందు కోర్టులను, వ్యవస్థలను మేనేజ్‌ చేసినట్లే, కేంద్రాన్ని, పత్రికలను మేనేజ్‌ చేసినట్లు, సింగపూర్‌ కంపెనీలను మేనేజ్‌ చేసినట్లే నిన్న కూడా చంద్రబాబు మేనేజ్‌ చేశారు. ఇది సరైంది కాదు. దీన్ని కట్‌ చేయాలి. ఎగువ సభపై చాలా చర్చ జరిగింది. మనం బాగా అభిమానించే డాక్టర్‌ అంబేద్కర్‌ ఎప్పుడో 70 ఏళ్ల క్రితం చంద్రబాబు లాంటి వ్యక్తుల గురించి ఆలోచించారు.ఎన్‌ రంగా కూడా ఆలోచించారు.  ఒక ప్రభుత్వం ద్వారా మోసగంచబడిన ప్రజలంతా కలిసి మరో ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తే ..ఆ ప్రభుత్వపు తాలుకు నిర్ణయాలను అడ్డుకోవడం ఎక్కడి న్యాయం. మెజారిటీ ప్రజల చేత ఎన్నుకోవడిన వ్యక్తి అందరి కోసం ఒక చట్టాన్ని రూపొందిస్తే..దాన్ని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం. ఐదేళ్లలో ఎన్నుకోబడిన ప్రభుత్వం ఫలితాలు చూపించాలి కదా? సమయాన్ని వృథా చేస్తే ప్రజలనే అవమానించినట్లు కదా? ప్రజాస్వామ్యవాదులందరూ ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసన మండలి ఉంది. మూడు కీలకమైన బిల్లులను మేధావులు అనే వారు అడ్డుపడ్డారు. ఇది ప్రమాదమైంది.  ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మండలి ఆపలేదు. కాకపోతే కొంత ఆలస్యం అవుతుంది. అయితే సమయం వృథా అయ్యే అవకాశం ఉంది.  ఈ గడ్డపై పుట్టిన ఎన్‌ జీ రంగా ఆ రోజు ఇలాంటి సభ అవసరమా అన్నారు. ప్రజల తీర్పును చంద్రబాబు గౌరవించడం లేదు. అనేక కమిటీల నివేదికల ఆధారంగా రూపొందించిన బిల్లును ఆపాలని ప్రయత్నం చేయడం ఏంటి? అదే చంద్రబాబు విజయమనుకుంటున్నారు. ప్రజల అభిప్రాయాన్ని అవమానిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వానికి అడ్డుపడటమే అవుతుంది. ఏ రాష్ట్రంలో మండలిని వద్దన్నారన్నదానిపై చర్చ జరగాలి. సెలెక్ట్‌ కమిటీ పేరుతో మూడు మాసాలు నిరోధించగలరు మాత్రమే కానీ..సాధించేది ఏమీ ఉండదు. నాలుగు నెలల కాలాన్ని తినేయాలన్నది చంద్రబాబు ఆలోచన. చివరిగా ఆయన చేసేదేం ఉండదు. జరిగేది జరుగుతుంది. బిల్లును ఆపడమంటే ప్రజాభిప్రాయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడమే. ప్రభుత్వం ఆలోచించి ఒక చర్చ జరిపించాలి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అన్నికంటే బలమైనది ప్రజల శక్తి. కౌన్సిల్‌ లేకపోతే పరిపాలన జరగదా? దీనివల్ల కలిగే ప్రమాదం ఏంటి అన్న దానిపై చర్చ జరగాలి. గెలవలేని వాళ్లంతా కౌన్సిల్‌కు వచ్చి ప్రజాభిప్రాయాన్ని అడ్డుకుంటున్నారు. ఈ పరిణామాలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. మూడు బిల్లును మండలి వ్యతిరేకించింది. దీన్ని బట్టి ఈ ప్రజల ఆకాంక్షలను కొనసాగించరని నా అభిప్రాయం. దీనిపై సీఎం ఆలోచన చేయాలి.
 

తాజా వీడియోలు

Back to Top