జగనన్న తోడుతో చిరు వ్యాపారుల‌కు ఆర్థిక భరోసా

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

శ్రీ‌కాకుళం: జగనన్న తోడు పథకంతో నిరుపేద చిరు వ్యాపారులు,  తోపుడు బండ్లు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృతులు వారికి, హస్త కళాకారులకు ఆర్థిక భరోసా లభించిందని ఎమ్మెల్యే  ధర్మాన ప్రసాదరావు తెలిపారు. బుధవారం పెద్దపాడు క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని 1126 మంది జగనన్న తోడు లబ్ధిదారులు గత ఏడాది నవంబర్ లో రూ.1.126 కోట్ల రుణాలు తీసుకుని ఈ ఏడాది సెప్టెంబర్ లోగా చెల్లించిన వారికి వడ్డీ రూ 3.1 లక్షల జమ చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో రూరుల్ మండలం, గార ఎంపిపిలు నిర్మల శ్రీనివాసరావు, గోండు రఘురాం, మాజీ జెడ్పి చైర్మన్ ఎచ్చెర్ల సూరిబాబు, జెడ్పిటిసి సభ్యులు రుప్పా దివ్య, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, గోండు కృష్ణ, చిట్టి రవికుమార్, ముంజేటి కృష్ణ, అల్లు లక్ష్మీనారాయణ, గైనేటి చిన్ని, దానయ్య, నిలాద్రి, ఏపీఎం శ్రీకాకుళం, గార, ఏరియా కోఆర్డినేటర్, శ్రీ నిధి మేనేజర్, ఎంఎంఎస్ ప్రెసిడెంట్, సిసి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top