సాహస బాలిక హిమ ప్రియకు ఎమ్మెల్యే ధర్మాన అభినందనలు

శ్రీ‌కాకుళం: టెర్రరిస్టుకు ఎదురు నిలిచిన సాహస బాలిక హిమ ప్రియకు వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్యే ధర్మాన అభినందనలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొన్నాం గ్రామానికి చెందిన గురుగు హిమప్రియకు ఇటీవల అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పెద్దపాడు లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును ఆమె కలుసుకున్నారు. బాల పురస్కారాన్ని అందుకునందుకు ఆమెను అభినందించారు. ఆమె ధైర్యం యువతను ప్రేరేపిస్తూనే ఉంటుందిని అన్నారు. ఒక ఆపద వచ్చి నప్పుడు ఎలాంటి సమయస్ఫూర్తి ప్రదర్శించాలో హిమ ప్రియ లోకానికి తెలియ జేసిందని ప్రసాదరావు  కొనియాడారు. వారి కుటుంబానికి ఇళ్ల పట్టా మంజూరు చేయనున్నట్టు ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top