పేదల క‌నీళ్లు తుడిచే బడ్జెట్‌ ఇది..

రైతు భరోసాతో రైతు కుటుంబాలకు మేలు

పాదయాత్రలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేరుస్తుంది..

రాజ్యాంగ వ్యవస్థలను  చంద్రబాబు నాశనం చేశారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు 

అమరావతిః వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్‌ నూతన అధ్యాయానికి తెరతీసిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ధర్నాన ప్రసాదరావు అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో సమస్య ఉందన్నారు.అన్నీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌ను రూపొందించారన్నారు.ౖ వెయస్‌ఆర్‌ పాలన దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పేదలు,బడుగులకు అందించిన వ్యక్తి వైయస్‌ఆర్‌ అని ప్రస్తుతించారు.ఆ పథకాల లబ్ధి చూసిన ప్రజలే వైయస్‌ఆర్‌సీపీని ఆదరించారని తెలిపారు.సీఎం వైయస్‌ జగన్‌ పాదయాత్ర హామీలు ఈ బడ్జెట్‌లో కనిపిస్తున్నాయన్నారు. బడ్జెట్‌ ప్రవేశ పెట్టినప్పుడే ఏ వర్గాలకు ఎంత కేటాయించాలో  స్పష్టంగా కేటాయింపులు జరిగాయని వెల్లడించారు.అమ్మఒడి పథకం చాలా గొప్ప పథకం అని తెలిపారు.అక్ష్యరాస్యతను పెంచేందుకు అమ్మ ఒడి పథకం ఉపయోగపడుతుందన్నారు.రాష్ట్రంలో 60 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.పెద్ద సంఖ్యలో ఉన్న వారిని  నిర్లక్ష్యం చేయడం తగునా అని ప్రశ్నించారు.వాళ్లంతా ఇతర రంగాల్లో వస్తే తట్టుకునే సామర్థ్యం ఉందా?  అని ప్రశ్నించారు.

రైతు భరోసా పథకం రైతు కుటుంబాలకు మేలు కలిగిస్తోందన్నారు. రైతుల కష్టాలన్నీ ఈ బడ్జెట్‌ తీర్చుతుందన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని,ఎన్నికల తర్వాత ప్రజలను పార్టీ రహితంగా ఎప్పడైనా చేశారా అని ప్రశ్నించారు.గత ఐదేళ్లలో ప్రజలు ఎంతో హింసకు గురయ్యారని తెలిపారు.ప్రజలు చైతన్యవంతులన్ని మనం చేసే పనుల్లో ప్రతి అంశాన్ని  గుర్తిస్తు ఉంటారని తెలిపారు.ఎందుకు ఓడిపోయారో చంద్రబాబుకు ఇప్పటికీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు.చంద్రబాబు ఓటమికి పెద్ద చిట్టా ఉందన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని ప్రభుత్వం నెరవేస్తుందన్నారు.పేదల కన్నీళు తుడిచే బడ్జెట్‌ అని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను పార్టీలకతీతంగా వైయస్‌ఆర్‌ అమలు చేశారని తెలిపారు.వైయస్‌ఆర్‌సీపీ చేతల ప్రభుత్వం అని, బడ్జెట్‌ ద్వారా దాన్ని చూపిందన్నారు. వ్యవసాయ ఆథారిత రాష్ట్రంలో తమ పిల్లలను వ్యవసాయం వైపు చూడనివ్వడంలేదు.ఇతర రంగాల వైపు ప్రోత్సహిస్తున్నారన్నారు.

వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు చివరకు ఏమీ మిగలడంలేదన్నారు.రైతు భరోసా,9 గంటల విద్యుత్, రైతులకు ఇన్సూరెన్స్,సున్నా వడ్డీ రుణాలు ఇవన్నీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పథకాలేనని తెలిపారు. వ్యవసాయానికి రూ.24 వేల కోట్లు కేటాయింపుల ద్వారా రైతులకు నమ్మకం కల్పించామన్నారు.సొంతిల్లు పేదవాడి కల అని, ఆ కలలు  నెరవేర్చేందుకు వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చంద్రబాబు సర్కార్‌లో పేదవాడి ఇళ్ల నిర్మాణానికి ఒక్క ఎకరం కొనుగోలు చేసేందుకు బడ్జెట్‌  కేటాయించారా అని ప్రశ్నించారు.ప్రభుత్వ భూములు లేని చోట భూములు కొనుగోలు చేసి పేదవాడికి ఇళ్ల కోసం ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం సంతోషమన్నారు.ఎన్నికల్లో ఓటు వేయని వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందించాలనుకోవడం గొప్ప లక్ష్యమని పేర్కొన్నారు.

చంద్రబాబు హయాంలో ఇంటిపై టీడీపీ జెండా  కట్టి..పచ్చ చొక్కా వేస్తేనే ప్రభుత్వ పథకాలు అందే పరిస్థితి ఉండేదని తెలిపారు. చంద్రబాబు 19 సార్లు కేబినెట్‌ మీటింగ్‌లు పెట్టినా  ఇసుక అక్రమ రవాణా ఆగలేదన్నారు.సీఎం వైయస్‌ జగన్‌ ఇసుకపై కొత్త పాలసీ తీసుకొస్తామనగానే అక్రమ ఇసుక రవాణా రాష్ట్రం మొత్తం ఆగిపోయిందన్నారు.నాయకుడి నిబద్ధతకు ఇది ఉదాహరణ అని తెలిపారు.మత్స్యకార గ్రామాల్లో మహిళలు.. బెల్టుషాపులు రద్దు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఐదేళ్లలో రాజధాని పేరుతో చంద్రబాబు సాధించిందేమిటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే,మంత్రులకు ఒక్క క్వార్టర్‌ కట్టలేదని,నాలుగో తరగతి సిబ్బంది ఉండేందుకు గృహ నిర్మాణం జరగలేదన్నారు. గవర్నర్,స్పీకర్‌ వ్యవస్థలతో పాటు అన్ని రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారని మండిపడ్డారు.
 

తాజా వీడియోలు

Back to Top