బాబూ..మీ ఆశను వైయస్‌ జగన్‌ నెరవేర్చుతున్నాడు

గతంలో శాసన మండలి వద్దు అని చంద్రబాబు చెప్పారు

ఈ రోజు మండలి రద్దు అయితే ఇంట్లో దాక్కుంటున్నారు 

1996లో ఎన్టీఆర్‌కు, ఇప్పుడేమో ప్రజాస్వామ్యానికి చంద్రబాబు  చంద్రబాబు వెన్నుపోటు

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

అసెంబ్లీ మీడియాపాయింట్‌: గతంలో చంద్రబాబు శాసన మండలి వద్దన్నారని, ఆయన ఆశను మా నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ రోజు నెరవేర్చుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు.
శాసన మండలి ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం లేదన్నారు. శాసన మండలి రాజకీయ పునరావాస కేంద్రం తప్ప.. ఎలాంటి ప్రయోజనం లేదని చంద్రబాబు అన్నారు.
శాసన మండలి రద్దుపై శాసన సభలో ఆమోదానికి వచ్చే నిర్ణయం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తీసుకునే నిర్ణయం. చంద్రబాబు చర్యలు, ఆలోచనలు మండలి రద్దుకు కారణమయ్యాయి. ఆ రోజు చంద్రబాబు నిండు సభలో 1995లో ఎన్టీఆర్‌ను వెన్నుపోడిచారు. ఈ రోజు అదే నిండు సభలో ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు చంద్రబాబు మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ రోజు శాసన మండలి ఎలా రద్దు చేస్తారు. మీకు అధికారం ఎవరిచ్చారని చంద్రబాబు చిలుక పలుకులు మాట్లాడుతున్నారు. 12వ శాసన సభలో 2004 జులైలో నిండు సభలో చంద్రబాబు అన్న మాటలు ఈ రాష్ట్ర ప్రజలు వినాలి. ఆ రోజు నిండు సభలో శాసన మండలి పునరుద్దరిస్తామని డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నప్పుడు ..చంద్రబాబు ఏన్నారంటే..మీ నిర్ణయం వల్ల వారికి పదవులు వస్తాయి కానీ, కార్యకర్తలు, నాయకులకు రాజకీయంగా పునరావాసం కల్పిస్తారే తప్ప..ఇది సరైంది కాదని ఆ రోజు చంద్రబాబు అన్నారు. 1918లో శాసన మండలి వస్తే శాసనాలు ఆమోదం కావడం బలి అవుతుందని అప్పట్లో సభ్యులు చెప్పారు. శాసన మండలి అవసరమా అని ఆ రోజు చంద్రబాబు అన్నారు. బిల్లులు పాస్‌ చేసుకోవడం తప్ప ప్రయోజనం లేదు. ఆర్థిక భారమన్నారు. రాజకీయ పునరావాస కేంద్రమని ఆ రోజు బాబు అన్నారు. శాసన మండలి చేతికి ఆరో వేలు అంటూ ఆ రోజు మండలి ఏర్పాటును వ్యతిరేకించారు. చంద్రబాబు ఆ రోజు దుర్మార్గంగా మాట్లాడారు. ఈ రోజు అదే చంద్రబాబు శాసన మండలి అవసరం లేదా అంటున్నారు. కావాలనుకున్నప్పుడు ఒకలాగా, వద్దనుకున్నప్పుడు మరోలాగా చంద్రబాబు అలా మాట్లాడవ‌చ్చా? 10వ షెడ్యూల్‌లో యాంటీ డిఫెన్స్‌లా ఉన్నప్పుడు చంద్రబాబు ఎప్పుడైనా గౌరవించారా?. మీలాగా అప్రజాస్వామ్యంగా వ్యవహరించడం మాకు  ఇష్టం లేదు. మీలాగా కొనుగోలు చేయడం మాకు ఇష్టం లేదు. చంద్రబాబు ఆరోజు ఆశను ఈ రోజు తీర్చుతున్నాం. మీ మాట నెగ్గుతున్నప్పుడు సమర్ధించాలి..అండగా నిలవాలి?. ఆ రోజు మీకు వేరుగా కనిపించి ఉండవచ్చు..ఈ రోజు మీకు లోకేష్‌ మాత్రమే కనిపిస్తున్నారు. ఆ రోజు మా నాయకుడు వైయస్‌ జగన్‌ శాసన సభలో తీరు సరిగా లేదని, ప్రజా సమస్యలు పక్కదారి పడుతున్నాయని, శాసన సభలోకి అడుగుపెట్టనని నిర్ణయం తీసుకున్నారు. ప్రజల బలంతో ఈ రోజు సభలో అడుగుపెట్టారు.ఈ రోజు మీరు శాసన సభలో అడుగుపెట్టమంటున్నారు. ఇంట్లో కూర్చొని ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే మీడియాతో మాట్లాడటం కాదు..సభలోకి వచ్చి చెప్పండి. ఈ రోజుకి..ఈ రోజుకి మీ మాటల్లో ఉన్న వ్యత్యాసం ఏంటో ప్రజల ముందు పెడతాం. ఈ రోజు మీరు మాట్లాడింది నాడు-నేడు కింద చూపిస్తాం. ప్రజల మధ్యకు రావాలి. దేవాలయం లాంటి సభలోకి వచ్చి మీ వాయిస్‌ వినిపించాలి. సలహాలు, సూచనలు ఇవ్వాల్సిన సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఏదైతే మాట్లాడారో..ఏదైతే ఆశించారో..ఎదైతే రద్దు చేయాలని కోరుకున్నారో..మీ ఆశను మా నాయకుడు నెరవేర్చుతున్నాడు. మీ కోరిక నెరవేరుతున్నప్పుడు సంతోషించాల్సింది పోయి..ఎందుకు దాక్కుంటారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు మేలు చేసేలా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు ప్రజలందరూ స్వాగతిస్తున్నారు. 
 

Back to Top