ప్రకాశం: మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న సైకో టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అంటూ వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్‌పై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సొంత ఇంటిలో కాల్పులు జరిపి మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకున్న నీవు సైకోవి. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి ప్రభుత్వాన్ని పేదల గడప దగ్గరికి తెచ్చిన జగన్ గొప్పుడు. సొంత తండ్రి పెట్టిన పార్టీలో నీ స్థాయి ఏంటి? నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి నీ బావ ( చంద్రబాబు నాయుడు) నిన్ను పక్కనపెట్టి నీ పోటీదారుడైన చిరంజీవి తమ్ముడిని తన పక్కలో కూర్చోబెట్టుకున్నాడు అనే ఆక్రోషం నీలో ఉంటే నువ్వు నీ బావ తేల్చుకోండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన అసెంబ్లీలో మతి తప్పి, మతిభ్రమించి అధికార మదంతో నీవు మాట్లాడిన మాటలు తీవ్ర అభ్యంతరకరం. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని నిన్ను హెచ్చరిస్తున్నాము. ఇలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పునరావృత్తం అయితే తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాను.