కాలర్‌ ఎగరేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నాం

తిరుపతి జిల్లా ప్లీనరీలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి 

తిరుపతి:  సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేశాడు కాబట్టే మేమంతా కాలర్‌ ఎగరేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. దివంగత మహానేత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని ప్రసంగించారు. 95 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దేనని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే  చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు.  

సామాజిక విప్లవానికి తెరతీసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అని ఎమ్మెల్యే వరప్రసాద్‌ కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, బియ్యం మధుసూదన్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు.
 

Back to Top