చంద్రబాబుది సైంధవుడి పాత్ర

ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి
 

అసెంబ్లీ: మండలిలో బిల్లులను అడ్డుకోవడం చంద్రబాబు సైంధవుడి పాత్రకు నిదర్శమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమది ఘనమైన చరిత్ర అని, రాజకీయ అవసరాల కోసం హత్యా రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు మాత్రమే సీమలో ఉన్నాయని టీడీపీ చిత్రీకరించిందని మండిపడ్డారు. మహావిష్ణువు స్వయంభూ గా వెలసిన ప్రాంతం రాయలసీమ.. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య జన్మించిన ప్రాంతం..చిత్రరాజాలు తీసిన కేవిరెడ్డి జన్మించిన ప్రాంతమని భూమన తెలిపారు. రాయలసీమకు అన్యాయం చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రను అభివృద్ధి పథంలో తీసుకురావాలని  సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలని  తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర ద్వారా అన్ని ప్రాంతాల ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని.. ప్రాంతాల మధ్య సమతుల్యత చేయాలనుకున్నారని చెప్పారు. ఒకప్పుడు మండలిలో మహానుభావులు ఉంటే.. ఇప్పుడు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లోని నిందితులు, ఒక్కసారి కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో గెలవని వారు, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో గెలవలేని వారు ఉన్నారని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్న మండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇస్తున్నామని భూమన పేర్కొన్నారు.

Back to Top