పోలవరం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు

ఆర్‌అండ్‌ఆర్‌లో జరిగిన అవినీతిని బయటకుతీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

 

అమరావతి: పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. పోలవరం ప్రాజెక్టు స్వప్నాన్ని నిలబెట్టింది మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి కరువును తరిమి శాశ్వతంగా సాగు, తాగునీరు అందించాలని మహానేత వైయస్‌ఆర్‌ పోలవరం ప్రారంభించారు. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టు దగ్గరకు వచ్చి ఫొటోలు దిగి వెళ్లడమే తప్ప.. తట్టెడు మట్టి తీసిన పాపానపోలేదన్నారు.

పోలవరాన్ని చంద్రబాబు పబ్లిసిటీకి వాడుకున్నారన్నారు. పోలవరం ముంపు గ్రామాల్లో లక్షల మంది నిర్వాసితులు ఉన్నారని, వారి గురించి ఏనాడూ చంద్రబాబు ఆలోచించలేదన్నారు. లక్ష మంది నిర్వాసితుల్లో 80 శాతం గిరిజనులే ఉన్నారని, వారి కోసం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ సక్రమంగా అమలు చేయలేదన్నారు. నిర్వాసితులకు సేకరించిన భూముల్లో ఆర్‌ అండ్‌ ఆర్‌లో అనేక అవినీతి అక్రమాలు జరిగాయన్నారు. సంబంధిత మంత్రి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.

తాజా ఫోటోలు

Back to Top