రాజకీయమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం ఉంటే తగదు

మూడు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది

పంపింగ్‌ పథకంలో పనులు నాసిరకంగా జరుగుతున్నాయి

ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి

అసెంబ్లీ: రాజకీయమే లక్ష్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టడం తగదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టులపై మంగళవారం సభలో ఆయన మాట్లాడారు. నాన్‌ డెల్టా ప్రాంతం నుంచి ప్రతినిధులుగా రావడమే మా దురదృష్టం. మొన్న పరిశ్రమల శాఖ మంత్రి గౌతంరెడ్డిని ప్రశ్న అడిగినప్పుడు టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. మా ప్రాంతంలో పంటలకు నీళ్లు లేవు, పరిశ్రమలు లేవు. అక్కడ అభివృద్ధి లేదు. ఈ సభ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేందుకు మేం ప్రయత్నిస్తుంటే..మెట్ట ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని  మేం అడుగుతుంటే ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారు. ఈ రోజు ఇరిగేషన్‌ మంత్రి ఆనం సంజీవరెడ్డి సోమశిల హైలెవల్‌ కెనాల్‌కు సంబంధించి వివరణ ఇచ్చారు. 2013లో ఈ ప్రాజెక్టు మంజూరైంది. అప్పటి సీఎం వైయస్‌ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ఉదయగిరి నియోజకవర్గానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించేందుకు అక్కడికి వచ్చారు. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మేమంతా కలిసి మాకు సాగునీరు, తాగునీరు లేదని వైయస్‌ఆర్‌ను అడిగాం. మాకు వర్షాధారం లేదు, సాగునీరు లేదని చెప్పాం. ఆ తరువాత సీఎం ఆదేశాలు ఇచ్చారు. సర్వేలు చేశారు. మా దురదృష్టం మహానేత అకాల మరణం చెందడం. ఆ తరువాత 2013లో ఈ ప్రాజెక్టు మంజూరు చేశారు. సోమశీల ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా 5 టీఎంసీలు తీసుకురావాలని, 5 వేల క్యూసెక్కులు వచ్చే విధంగా కాల్వలు, పైప్‌లైన్లు డిజైన్‌ చేయాలని కోరాం. ఆత్మకూరు నియోజకవర్గంలో కొన్ని, ఉదయగిరి నియోజకవర్గంలో కొన్ని మండలాలు కలిపి డిజైన్‌ చేశాం. ఫేజ్‌ వన్‌ కింద రూ. 830 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. దానిలో 55 శాతం పనులు జరిగాయి. ఇందులో భూ సేకరణ సమస్య ఉంది. ప్రైవేట్‌ రైతుల భూసేకరణలో జాప్యం జరగడంతో ప్రాజెక్టులో ఆలస్యం జరుగుతుంది. ఇన్నేళ్లు అయినా ఫేజ్‌ వన్‌లో 57 శాతమే పనులు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దాదాపు 97 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాదాపుగా రెండున్నర లక్షల మంది ప్రజల దాహర్తి తీరుతుంది. మెట్ట ప్రాంతం కాబట్టి వర్షాలు కూడా కురవవు. ఇటువంటి ఎత్తిపోతల పథకాల ద్వారానే రైతులు పంటలు పండించుకోవాలి. తాగునీటికి కూడా ఇవే ప్రధానం. ఐదు రిజర్వాయర్లు రావాల్సి ఉంటే మొదటిఫేజ్‌లోనే వీటిని నిర్మించాల్సి ఉంది. పొంగూరులో మాత్రమే 25 శాతం భూసేకరణ జరిగి కొంత పనులు చేశారు. పంపింగ్‌ స్కీమ్‌ ఉన్న ప్రాంతాల్లో కూడా నాసిరకంగా పనులు చేపడుతున్నారు. మొదలైన ప్రాజెక్టుల్లో పనులు నాణ్యతతో చేయించాలి. దాదాపు 5 మండలాల్లో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 54 మండలాలకు తాగునీరు ఇవ్వాలి. ఇందులో జాప్యం లేకుండా పనులు త్వరితగతిన చేపట్టాలి. గతంలో కేవలం రాజకీయాల కోసం ఫేజ్‌ -2కు టెండర్లు పిలిచారు. ఎన్నిలకు కోసం జనవరిలో టెండర్లు పిలిచారు. ఈ ప్రాజెక్టుల ప్రయోజనం ప్రజలకు చేరదు. వైయస్‌ఆర్‌ సంకల్పించిన ప్రాజెక్టులను త్వరితగతిన భూసేకరణలు పూర్తి చేసి, నాణ్యమైన పనులు చేయించాలి. 

 

 

Back to Top