కేసీఆర్‌ను మంచి అంటే బాబుకెందుకు కడుపుమంట

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు
 

 

అమరావతి: శాసనసభను సజావుగా నడవనివ్వకుండా ఉండేందుకే ప్రతిపక్షనేత చంద్రబాబు అసెంబ్లీకి వచ్చినట్లుగా ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సభా నాయకులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గోదావరి జలాలపై మాట్లాడుతుండగా మధ్యలో ప్రతిపక్ష పార్టీ సభ్యులు లేచి గందరగోళం సృష్టించారని, స్పీకర్‌ పోడియం చుట్టుముట్టేలా చంద్రబాబే వారిని ఉసిగొల్పారన్నారు. సభానాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంచివారన్నారు తప్ప చంద్రబాబు చెడ్డవాడని చెప్పలేదని చురకలు అంటించారు. చంద్రబాబు కంటే తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెయ్యి రెట్లు మంచివారని అంబటి అన్నారు. మంచివారంటే ఎందుకు చంద్రబాబుకు కడుపుమంట అని ప్రశ్నించారు. చంద్రబాబు చాలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాడన్నారు. శాసనసభలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు.

Back to Top