హంత‌కుల‌ను గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేయాలి

ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర‌నాథ్‌రెడ్డి డిమాండ్  

వైయ‌స్ఆర్‌ జిల్లా: రాజంపేట మండలం పులపుత్తూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దంపెట్ల మల్లిఖార్జున (40) హత్యకు గురవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హత్యకు పాల్పడిన వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనని, అవసరమైతే గ్రామ బహిష్కరణ చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, మృతుని భార్య లక్ష్మీదేవి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను మేను మహేష్ రాజు, బెల్ట్ షాపు సుబ్రహ్మణ్యం రెడ్డి కలిసి పాత కక్షల కారణంగా చంపారని ఆరోపించారు. ముందుగానే చంపుతామని బెదిరించి, రాత్రి సమయంలో రాయితో దాడి చేసి హత్య చేశారని తెలిపారు.  

Back to Top