ఎమ్మెల్సీ అభ్య‌ర్థి విక్రాంత్ బాబుకు మంత్రుల అభినంద‌న‌లు

తాడేపల్లి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ బి-ఫారం అందుకున్న ఎమ్మెల్సీ అభ్య‌ర్థి పాలవలస విక్రాంత్ బాబును ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ , రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాత్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు అభినందించారు. ఎమ్మెల్యే కోటాలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులుగా ఇవాళ విక్రాంత్‌బాబు, ఇష్యాంత్‌బాషా, డీసీ గోవింద‌రెడ్డి నామినేష‌న్ దాఖ‌లు చేస్తున్నారు. వీరికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఉద‌యం బీఫాం అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు శిల్పా ర‌విచంద్ర‌కిశోర్‌రెడ్డి, దాస‌రి సుధ‌, విశ్వ‌స‌రాయి క‌ళావ‌తి, కంబాల జోగులు, వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు పాలవలస రాజశేఖరం , వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top