జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరి ఆరోగ్యానికి రక్ష

 జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభోత్స‌వంలో మంత్రి విడ‌ద‌ల ర‌జినీ

గుంటూరు: జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరి ఆరోగ్యానికి రక్ష లాంటిద‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జినీ పేర్కొన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌గ‌న‌న్న సుర‌క్ష కార్య‌క్ర‌మాన్ని వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభించారు.   

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో  వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినిమాట్లాడారు. 
సీఎంగారు ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ సాధన దిశగా వేస్తున్న అడుగుల్లో భాగంగా తీసుకొస్తున్న అనేక మార్పులు ఈ నాలుగేళ్ళలో చూశాం. ఇందులో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష కూడా ఒక ముఖ్యమైన అడుగుగా భావించాల్సి ఉంది. ఇప్పటివరకు ఏపీలో 90 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధిపొందుతున్నాయి. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి వ్యక్తికి, ప్రతి గడపకు, ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశం, మన జగనన్న సంక్షేమ రాడార్‌ నుంచి కూడా ఏ ఒక్కరూ తప్పించుకోకుండా మెరుగైన వైద్య సేవలు అందించే గొప్ప కార్యక్రమమే ఇది. కచ్చితంగా మనమంతా కలిసికట్టుగా పనిచేసి ప్రజలందరికీ కూడా మరింత ఉపయోగపడేలా ఉంటుందని భావిస్తూ, జగనన్న ఆరోగ్య సురక్ష ప్రజలందరి ఆరోగ్యానికి రక్షగా ఉండబోతుందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను అని మంత్రి విడద‌ల ర‌జినీ పేర్కొన్నారు. 

Back to Top