చంద్రబాబు ప్రచార వ్యామోహం వల్లే 8 మంది మృతి 

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ 
 

అమ‌రావ‌తి: చంద్రబాబు ప్రచార వ్యామోహం వల్లే 8 మంది మృతి చెందారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ‘‘విజన్‌ గురించే మాట్లాడే చంద్రబాబుకు అసలు విజనే లేదు. గోదావరి పుష్కరాల్లో పబ్లిసిటీ పిచ్చితో 29 మందిని బలిగొన్నారు. చంద్రబాబు అధికార వ్యామోహం తగ్గించుంటే మంచిది’’ అని మంత్రి హితవు పలికారు.

చంద్రబాబు అధికార దాహానికి 8 మంది బలి: ఎమ్మెల్యే పిన్నెల్లి
కందుకూరులో చంద్రబాబు సభ.. అధికార దాహానికి పరాకాష్ట అని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఇరుకు సందులో సభ పెట్టి తక్కువ జనం వచ్చినా.. ఎక్కువ మంది వచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అధికార దాహానికి 8 మంది చనిపోయారు. చంద్రబాబు వల్ల 8 మంది పేద కుటుంబాలు రోడ్డునపడ్డాయని పిన్నెల్లి అన్నారు.

చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని: గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని అని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు. ఇరుకు సందులో సభ పెట్టి డ్రోన్ కెమెరాలతో విజువల్స్‌ చేయించి తన సభకు బాగా జనం వచ్చారని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇరుకు సందులో సభ వల్లే తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. చంద్రబాబు లాంటి ప్రతిపక్ష నేత ఉండటం మన ఖర్మ అని ప్రజలు అనుకుంటున్నారని గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top