వైయస్‌ఆర్‌సీపీ మినహా రాష్ట్రంలో ఇతర పార్టీలకు చోటు లేదు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

పరిషత్‌ ఫలితాలతో విపక్షాల్లో గుబులు మొదలైంది

రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో లేరు

పరిషత్‌ ఎన్నికల్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు

వైయస్‌ఆర్‌సీపీ మినహా రాష్ట్రంలో ఇతర పార్టీలకు చోటు లేదు

ప్రజలు కోరుకుంటున్నది మాటల మనిషిబాబును కాదు..చేతల మనిషి వైయస్‌ జగన్‌ను 

నారావారి పల్లె, నిమ్మకూరుల్లో ప్రజలు వైయస్‌ జగన్‌కు జై కొట్టారు
డ్రగ్స్‌పై టీడీపీ నేతలు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు
గుజరాత్‌లో పట్టుబడ్డ డ్రగ్స్‌తో విజయవాడకు సంబంధం లేదు

తాడేపల్లి: రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది మాటల మనిషి చంద్రబాబును కాదు..చేతల మనిషి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అని ఇటీవల వెల్లడైన పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో రుజువైందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ మినహా రాష్ట్రంలో ఇతర పార్టీలకు చోటు లేదు. టీడీపీ నేతలు డ్రగ్స్‌ సేవించి మాట్లాడుతున్నట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వెల్లంపల్లి శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడారు. 

ఇటీవల నిర్వహించిన పరిషత్‌ ఎన్నికల లెక్కింపులో వైయస్‌ఆర్‌సీపీకి ఎంపీటీసీలు 86 శాతం సీట్లు, జెడ్పీటీసీలు 98 శాతం సీట్లు  వచ్చాయి. దాన్ని చూసిన తరువాత టీడీపీ, ఇతర రాజకీయ పార్టీల్లో..చంద్రబాబు మొదలు, దిక్కుమాలిన పట్టాభి వరకు అందరికీ గుబులు మొదలైంది. ఈ ప్రభుత్వంపై, సీఎం వైయస్‌ జగన్, మంత్రులపై అనేక రకాల ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా చంద్రబాబు మాటలను నమ్మలేదు. ఏకపక్షంగా వైయస్‌ జగన్‌కు తోడుగా ఉండేలా ఈ ఫలితాలు వచ్చాయి. ఎన్నికలు బహిష్కరించామని చంద్రబాబు తాబేదార్లు జబ్బలు కరుచుకుంటున్నారు. 

గతంలో జరిగిన పంచాయతీ, తిరుపతి ఉప ఎన్నిక, మున్సిపల్‌ ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కాళ్లకు బలపాలు కట్టుకుని సందు సందులో తిరిగారు. తిరుపతిలో బీజేపీ నాయకులు మకాం వేసినా కూడా వైయస్‌ఆర్‌సీపీకే ఓటర్లు పట్టం కట్టారు. ఈ రోజు వైయస్‌ జగన్‌ అనేక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తుంటే తట్టుకోలేక అనేక వంకాలు చెప్పుకుంటున్నారు. పార్టీ లేదు..బొక్క లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే మాట్లాడారు. 

తిరుపతి ఉప న్నిక సమయంలో అచ్చెన్న భోజనం చేస్తూ ఈ మాటలు అన్నారు. భోజనం చేసే సమయంలో ఎవరూ అబద్ధం చెప్పరు. యనమల, చంద్రమోహన్‌రెడ్డిలేమో మనకు ఎస్సీలు, బీసీలు లేరని జూమ్‌ మీటింగ్‌లో చర్చించుకునేది అందరూ చూశారు. అలా మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఇష్టం వచ్చినట్లు అవాకులు, చవాకులు పేలుతున్నారు.

లోకేష్‌..టీడీపీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అంటున్నారు. మేమేమో ఆయన్ను ప్రవాసాంధ్రుడు అనుకుంటున్నాం. ఆయన వారానికి ఒకసారి ఏపీకి వచ్చి వెళ్తుంటారు. చంద్రబాబు కూడా గెస్ట్‌ లాగా ఏపీకి వస్తాడు..గెస్ట్‌ హౌస్‌లో స్టే చేస్తున్నారు. ఇలాంటి వారిని ప్రజలు ఏవిధంగా నమ్ముతారు. 

ఐదేళ్లలో అమరావతిని బ్రహ్మండగా నిర్మిస్తానని గ్రాఫిక్స్‌లో ప్రజలను మభ్యపెట్టి భ్రమరావతి చూపించాడు. గ్రాఫిక్స్‌ ద్వారా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తే ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. నారా లోకేష్‌ను మంగళగిరిలో చిత్తు చిత్తుగా ఓడించారు. ఏపీ ప్రజలపై కోపం, ధ్వేషంతో ఉన్నారు. చంద్రబాబు చంద్రగిరిలో పుట్టాడు..అక్కడి నుంచి కుప్పానికి పారిపోయాడు.

 కుప్పం ప్రజలు కూడా ఈ రోజు ఛీ పో..అని చంద్రబాబుకు ఛీకొట్టారు. కుప్పం ప్రజలు ఏకపక్షంగా వైయస్‌ జగన్‌కు మద్దతు పలికారు. నందమూరి తారక రామారావు సొంతూరు నిమ్మకూరు ప్రజలు కూడా వైయస్‌ జగన్‌ అవసరమని ఓటు వేశారు. నారా లోకేష్, భువనేశ్వరి దత్తత గ్రామాల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీకి పట్టం కట్టారు. మాటల మనిషి  చంద్రబాబు అక్కర లేదు..చేతల మనిషి మాకు అవసరమని వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేశారు. 

వైయస్‌ జగన్‌ చెప్పిన ప్రకారం 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పరిషత్‌ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల ప్రకారంసీట్లు కేటాయించారు. మహిళలకు ప్రత్యేకంగా 50 శాతం పదవులు కట్టబెడుతున్నారు.

 వైయస్‌ జగన్‌ ఇవాళ రాష్ట్రంలోని 13 జెడ్పీ చైర్మన్‌ పదవుల్లో 7 చోట్ల మహిళలను చైర్‌పర్సన్లుగా చేస్తున్నారు. ఆరుగురికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చైర్మన్‌ పదవులు ఇస్తున్నారు.  660 ఎంపీపీ పదవుల్లో 335 ఎంపీపీలను మహిళలకు ఇస్తున్నారు. 330 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంపీపీ పదవులు ఇస్తున్నారు. 

వైయస్‌ జగన్‌ అన్నిసామాజిక వర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు. అందరికీ రాజ్యాధికారం రావాలన్న ఉద్దేశంతో ఈ రోజు పరిపాలన చేస్తున్నారు. ప్రజలందరూ కూడా వైయస్‌ జగన్‌ ఉంటే దిక్కుమాలిన టీడీపీ, ఇతర పార్టీలు నోరు మెదుపుతున్నారు.

మారకద్రవ్యాలు అంటూ బొండా ఉమా మొదలు చెంచాలు ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడో గుజరాత్‌లో డ్రగ్స్‌ పట్టుబడితే..మద్రాస్‌లో ఉన్న వ్యక్తి ఇక్కడ పట్టుబడితే దాన్ని రాష్ట్రానికి ఆపాదిస్తున్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

డ్రగ్స్‌ గురించి ఇదివరకే గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే ..వాటిని సేవించే వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నట్లు గుర్తించాను. ఉన్మాదం, పిచ్చి ప్రేలాపణలు, నిరాశ, విపరీతమైన కోపం, సమాజంపై వ్యతిరేకత అనే లక్షలు ఉంటాయట. సాధ్యమైనంత వరకు ఎవరికి కనిపించకుండా ఉండే మనస్తత్వం వీరికి ఉంటుందట. ఉన్నట్టుంది వెయిట్‌ లాస్‌ కావాలని ప్రయత్నిస్తుంటారట. ఇవన్నీ కూడా గూగుల్‌లో చూశాను.

 ఈ లక్షణాలన్నీ నారా లోకేష్, బొండా ఉమా, అయ్యన్నపాత్రుడు, దేవినేని ఉమా, పట్టాభికే కనిపిస్తున్నాయి. ఏపీలో మాత్రం వీరికి డ్రగ్స్‌ దొరకవు. పక్క రాష్ట్రంలో తీసుకుంటారేమో? అయ్యన్నపాత్రుడు గతంలో గంజాయి వ్యాపారం చేశారట. ఆయన అప్పట్లో దాచుకుని వీళ్లందరికీ ఇచ్చి ఉంటారేమో?. అందుకే వీళ్లంతా మతి తప్పి, గతి తప్పి వేధవాళ్లా, దున్నపోతుళ్లా మాట్లాడుతున్నారు. 

మేం కూడా మీకంటే ఎక్కువగా మాట్లాడగలం. మాకు వైయస్‌ జగన్‌ వంటి గొప్ప నాయకుడు ఉన్నారు కాబట్టి కొంచెం అదుపులో ఉన్నాం. మంత్రి శాఖలు ఉన్నాయి కాబట్టి బాధ్యతగా ఉన్నాం. మీ మాదిరిగా మేం మాట్లాడితే ఎవరూ తట్టుకోలేరు.
ఈ రోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు చేసే దుర్మార్గపు ఆలోచనలు గమనిస్తున్నారు. 

గతంలో చంద్రబాబు రథాలను, దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ..ప్రజలు గమనించి చంద్రబాబును పక్కన పెట్టారు. ఆ తరువాత కులాలను రెచ్చగొట్టాలని ప్రయత్నించారు. ప్రజలు దాన్ని కూడా నమ్మలేదు. ఈ రోజు కొత్తగా మారక ద్రవ్యాలు అంటూ డ్రామా మొదలుపెట్టారు. ఈ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేకున్నా కూడా టî డీపీ నాయకులు మాట్లాడుతున్నారంటే..నాకు తెలిసీ ఇదంతా కూడా టీడీపీ కార్యాలయం నుంచే జరిగి ఉంటుంది. బొండా ఉమా బైక్‌ రేస్‌లో దొరికాడు. అలాంటి వ్యక్తులకు డ్రగ్స్‌ అలవాట్లు ఉంటాయి.

 ఈ రోజు వైయస్‌ జగన్‌ తులసి వనం మాదిరిగా ఏపీలో పరిపాలన చేస్తున్నారు. టీడీపీలో ఉన్న గంజాయి మొక్కలను పీకాల్సి ఉంది. మీడియా ఉందని, వ్యవస్థల ద్వారా పైకి వస్తాయని ప్రయత్నం చేయవచ్చు. అన్ని సమయాల్లో వ్యవస్థలు మిమ్మల్ని కాపాడలేవు. నిమ్మగడ్డను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వంపై ఎన్నిరకాలుగా కుట్రలు చేసినా పెద్దలు పెద్దిరెడ్డి, కొడాలి నాని, జోగి రమేష్‌లను మాట్లాడొద్దని  ఇబ్బంది పెట్టారు. ఎంత మంది అధికారులను బెదిరించారు. బదిలీ చేయించారు.

 కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా నిమ్మగడ్డ మీ వ్యక్తి అని తెలుసుకొని..మున్సిపల్, కార్పొరేషన్, పరిషత్‌ ఎన్నికల్లో నూటికి నూరు శాతం మాకు మద్దతు పలికారు. రాష్ట్ర ప్రజలంతా మాతోనే ఉన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని దిక్కుమాలిన రాజకీయాలు మానుకొని, రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేయాలని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సూచించారు. 

 

Back to Top