చంద్ర‌బాబు మేనిఫెస్టో  ఒక చిత్త కాగితం

రూ.600 కోట్ల‌తో విజ‌య‌వాడ న‌గ‌రాభివృద్ధి

మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్  

 
 విజ‌య‌వాడ‌: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మున్సిప‌ల్ ఎన్నిల కోసం విడుద‌ల చేసిన‌ మేనిఫెస్టో  ఒక చిత్త‌కాగిత‌మ‌ని మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ విమ‌ర్శించారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఎన్నిక‌ల ప్ర‌‌చారం నిర్వ‌హించారు. గ‌తం టీడీపీ హ‌యాంలో అంతా దోపిడీయే కొన‌సాగింద‌న్నారు. జ‌న్మ‌భూమి క‌మిఇటీల పేరుతో సొంవాళ్ల‌కే ప‌థ‌కాలు క‌ట్ట‌బెట్టార‌ని విమ‌ర్శించారు. టీడీపీ హ‌యాంలో అభివృద్ధిని పూర్తి నిర్ల‌క్ష్యం చేశార‌ని  మండిప‌డ్డారు. రూ.600 కోట్ల‌తో విజ‌య‌వాడ‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని మంత్రి వెల్ల‌డించారు. ప్ర‌తి ఇంటిలోనూ ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారులు ఉన్నార‌ని చెప్పారు.  చంద్ర‌బాబు మేనిఫెస్టో ద్వారా ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి మోసం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top