త్వరలో జనసేన బీజేపీలో విలీనం ఖాయం

తెలుగు ప్రజల పరువు తీసిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌

చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ బీజేపీతో చేతులు కలిపారు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: జనసేన పార్టీని త్వరలోనే పవన్‌ కల్యాణ్‌ బీజేపీలో విలీనం చేస్తారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు నిలకడ, నిబద్ధత లేదని చెప్పడానికి అనేక నిదర్శనాలు చెప్పవచ్చు. సొంత తమ్ముడై ఉండి..ముఖ్యమంత్రి కాలేదని అన్నయ్యను వదిలేశారు. అన్నం పెట్టిన అన్నయ్యను వదిలి వచ్చిన వ్యక్తి జనాలకు ఏదో చేస్తానంటే ..ఇది హాస్యాస్పదమే. ఆ రోజు చంద్రబాబు డైరెక్షన్‌లో బీజేపీని తిట్టారు. బీజేపీని దోషిని చేసి లబ్ధి పొందాలని చూశారు.  చంద్రబాబు పేవ్‌మెంట్‌ డైరెక్షన్‌లోనే జరిగింది. బీజేపీ ముసుగులో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని నిందించేందుకు పవన్‌ తోడు అయ్యారు. టీడీపీలో పుట్టిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌ వంటి వ్యక్తులు ఇవాళ చంద్రబాబు డైరెక్షన్‌లోనే బీజేపీలో చేరారు. పవన్‌ సినిమాల్లో రెమ్యూనరేషన్‌ తీసుకొని ఏవిధంగా నటిస్తారో..నిజ జీవితం, రాజకీయాల్లో నీచంగా డబ్బులు తీసుకొని ఈ విధంగా చేసే ఏ రాజకీయ నాయకుడిని కూడా చూడలేదు. ప్రత్యేక హోదా గురించి వైయస్‌ఆర్‌సీపీని అడగమంటున్నారు. పవన్‌..నీకు సిగ్గులేదా? నీవు ఆంధ్రోడివి కాదా? తెలుగొడివై ఉండి బీజేపీతో కలిసే సమయంలో మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి అని అడగాల్సింది పోయి..నాకు ప్యాకేజీ ఇవ్వండి బేషరత్తుగా బీజేపీలో జాయిన్‌ అవుతానని అడుక్కొని, బీజేపీ నేతల కాళ్లు పట్టుకొని, దేహీ దేహీ అంటూ మూడు రోజులు ఢిల్లీలో వెయిట్‌ చేసి ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరువును తీసిన వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌. రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌కు జేజేలు పడుతున్నారు. నీలాంటి దద్దమ్మలు ఎంత మంది వచ్చినా కానీ, నీలాంటి సినీ గ్లామర్‌తో ప్రజలను మోసం చేసే మోసగాళ్లు ఎంత మంది వచ్చినా కానీ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. సీఎం వైయస్‌ జగన్‌కు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా అండగా ఉన్నారు.పవన్‌ కనీసం ఎమ్మెల్యేగా గెలవలేదు కానీ..ఆయన జనాలను గెలిపిస్తారట.  ఈ రోజు పవన్‌కు విశ్వసనీయత లేదు కాబట్టే..క్యాడర్‌ చేజారిపోయింది. అందుకే ఇవాళ బీజేపీతో కలిసిపోయారు. రెండు, మూడు నెలల్లో జనసేనను బీజేపీలో విలీనం చేయడం ఖాయం. పవన్‌కు పర్మినెంట్‌ డైరెక్టర్‌ చంద్రబాబు. ఆయన ఇచ్చిన స్ట్రీప్ట్‌ను బట్టీ పట్టి మాట్లాడుతుంటారు. పవన్‌కు సొంతంగా స్ట్రీప్ట్‌ ఉండదు. సిద్ధాంతాలు ఏవి లేని అసమర్ధ రాజకీయ నాయకుడు పవన్‌..ఇలాంటి వంద మంది వ్యక్తులు వచ్చినా వైయస్‌ జగన్‌ను ఏమీ చేయలేవు.

Back to Top