దేవాలయాల పవిత్రతను కాపాడటమే లక్ష్యం

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

దేవాలయ పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు

అసెంబ్లీలో దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం

అమరావతి: దేవాలయాల పవిత్రను కాపాడటం, భక్తులకు మెరుగైన దర్శనం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం బిల్లును రూపొందించామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. అసెంబ్లీలో దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అసెంబ్లీ సమావేశాల్లో దేవాదాయ చట్ట సవరణ బిల్లును దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రవేశపెట్టారు. చట్ట సవరణ బిల్లుపై సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు నామినేటెడ్‌ పదవుల్లో పెద్ద పీట వేశారు. అలాగే దేవాయాల్లో కూడా వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ఈ బిల్లును రూపొందించాం.

ప్రతి దేవాలయంలో కూడా పాలక వర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ,  మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత ప్రభుత్వ హయాంలో కనకదుర్గ టెంపుల్‌లో చీరల దొంగతనం జరిగింది. సభ్యులపై ఎవరికి కూడా ఆజమాయిషీ లేకపోవడం గమనించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ..ఎవరైనా సభ్యులు అసభ్యంగా ప్రవర్తించినా, ఏదైనా దేవాలయాలకు ఆటంకం కల్పించినా ఆ సభ్యులను ట్రస్టు బోర్డు నుంచి తొలగించేలా బిల్లులో పేర్కొనడం సమంజసంగా ఉంది. ప్రతిదీ పారదర్శకంగా జరగాలని బిల్లులో సవరణ చేశాం. దేవాలయాల్లో పవిత్రతను కాపాడటం, భక్తులకు మెరుగైన దర్శనం కల్పించే విధంగా బిల్లును రూపొందించామని చెప్పారు. ఈ బిల్లును ఆమోదించాల్సిందిగా సభ ద్వారా కోరారు.  
 

Back to Top