అంబేడ్క‌ర్‌, పూలేకు ప‌ర్యాయ‌ప‌దం వైయ‌స్ జ‌గ‌న్‌

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచ‌ర‌ణ్‌

అనంత‌పురం: ఒక అంబేడ్కర్, ఒక జ్యోతిబా పూలేకు పర్యాయ పదం మన ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ అన్నారు. 75 ఏళ్ల స్వతంత్య్ర భారతావనిలో మన రాష్ట్రంలో 70 శాతానికి పైగా మంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చిన ఘ‌న‌త సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కే సొంత‌మ‌న్నారు. సామాజిక న్యాయ‌భేరి అనంత‌పురం బ‌హిరంగ స‌భ‌లో మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధిపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చిత్త‌శుద్ధితో అడుగులేస్తున్నార‌న్నారు. 

టీడీపీ మహానాడులో అక్కడి మహిళా నేతలు తొడలు గొట్టారు. కానీ, అది పసుపునాడు. వారికి విచక్షణ లేదని మంత్రి ఉషాశ్రీ‌చ‌ర‌ణ్ ధ్వ‌జ‌మెత్తారు. బీసీ కురుమ కుటుంబంలో పుట్టినా త‌న‌కు మంత్రి పదవి, ఎస్సీ మహిళకు హోం మంత్రి పదవి.. ఇదంతా కేవలం వైయస్‌ జగన్‌ వల్లనే సాధ్యమైందన్నారు. చంద్రబాబు వద్దు.. జగనన్న ముద్దు.. అనే నినాదంతో ముందుకెళ్లాల‌న్నారు. టీడీపీకి ఎల్లో మీడియా ఉంది. కానీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కి ప్ర‌జ‌లే మీడియా అన్నారు. వెనకబడిన ప్రాంతం అయిన అనంతపురం జిల్లా అభివృద్ధి కేవలం సీఎం  వైయస్‌ జగన్‌ వల్లనే సాధ్యమవుతుందన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎస్టీలు, మైనారిటీలకు అసలు మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఎన్నికలకు కేవలం ఆరు నెలల ముందు మాత్రమే వారికి పదవులు ఇచ్చారని గుర్తుచేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top