రైతన్నలకు పండుగ రోజు 

మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

ఘనంగా వైయ‌స్ఆర్‌ యంత్ర సేవా పథకం మెగా పంపిణీ ప్రారంభం

అనంత‌పురం: రైతన్నలకు ఆధునిక వ్యవసాయ పనిముట్లు, యంత్రపరికరాలు, ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లు తదితర వాటిని రాష్ట్రమంతా అందించాలనే తపనతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మెగా పంపిణీ చేపట్టార‌ని, ఈ రోజు రైతుల‌కు పండ‌గ రోజ‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ పేర్కొన్నారు. వైయ‌స్ఆర్ యంత్ర సేవా కార్య‌క్ర‌మాన్ని అనంతపురం జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  అనంతపురం జిల్లా మొత్తానికి 178 ట్రాక్టర్లు మంజూరైతే, శింగనమల నియోజకవర్గానికి 31 ట్రాక్టర్లు వచ్చాయి. వీటిలో గార్లదిన్నె మండలానికి 5. నార్పలకు 6, శింగనమలకు 6, బుక్కరాయ సముద్రానికి 4, పుట్లూరుకి 5, యల్లనూరుకి 5 మంజూరయ్యాయి. వీటన్నింటినీ వెంటనే లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి, ఉషాశ్రీ చ‌ర‌ణ్‌, ఎమ్మెల్యే  జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ..ఆరుగాలం కష్టపడినా రైతన్నలు లాభాల బాట పట్టడం లేదు. వ్యవసాయం భారమై పోయిందని భావించే రైతన్నల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది.  అందుకే ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఆలోచించి మన వ్యవసాయ పద్ధతులను సమూలంగా మార్చాలని భావించి వైయ‌స్సార్ యంత్ర సేవా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇందులో రైతన్నలకు పెట్టుబడి వ్యయం తగ్గించడం ఒక్కటే కాదు. వ్యవసాయ విధానాల్లో వేగం పెంచాలని, ఆధునిక పద్ధతులను తీసుకురావాలని ఆలోచించి వైయ‌స్సార్ యంత్ర సేవా పథకం, మెగా పంపిణీ కార్యక్రమానికి గుంటూరులో ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు.  ఈ పథకం కింద ఆర్బీకే, క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టరు, 320 కంబైన్ హార్వెస్టర్ల పంపిణీతోపాటు 5,260 రైతు గ్రూపు బ్యాంకు ఖాతాలకు రూ. 175.61 కోట్ల సబ్సిడీ జమ చేయనున్నారని వివరించారు.

Back to Top