త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న ప్ర‌తి ఒక్క‌రిని కోర్టుకు ఈడుస్తా

మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

అనంత‌పురం: ఎటువంటి సాక్ష్యం లేకుండా నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కోర్టుకు ఈడుస్తా అని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ హెచ్చ‌రించారు. మీడియా నిజాయితీగా వ్య‌వ‌హ‌రించాల‌ని, కొందరూ నాపై బురదజల్లి ఆ వచ్చే డబ్బుతో వాళ్ల ఇంట్లో పండుగ చేస్కొంటాం అంటే...ఐయామ్‌ హ్యాపీ...ఇలాంటి కథనాలు ఎన్ని అయినా ....వ్రాయండి అన్నారు. ఇవాళ కళ్యాణదుర్గం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్త్రీ శిశు‌ సంక్షేమ శాఖ మంత్రివర్యులు కే.వి.ఉషాశ్రీచరణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి  ఈనాడు పత్రికలో తనపై  వచ్చిన ఒక‌ అసత్యపు వార్తను ఖండిస్తూ టీడీపీలో టికెట్ కోసం ఇరు వర్గ టీడీపీ నాయకులు ఇలా తప్పుడు వార్తలను రాయిస్తున్నారని ఇవన్నీ అసత్యపు ప్రచారాలే  అంటూ ఆధారాలతో పాటూ మీడియా ముందు తెలిపారు. 
నేడు ఈనాడు పేపరులో రాసిన  అదే భూమి కోసం రైతులకు టీడీపీ ఉన్నం ఉదయ భాస్కర్ చౌదరి పది లక్షలు అడ్వాన్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నావ్ కదా...మరీ‌ మీ ఉన్నం ఫ్యామిలీ వాటా ఎంత మారుతి చౌదరి ....? అని మంత్రి ప్ర‌శ్నించారు. సిగ్గుశరం లేదా నీకూ...నాపై ఇలా తప్పుడు ప్రచారం చేయడం ఏంటి అని మంత్రి మండిప‌డ్డారు. ఈ సంద‌ర్భంగా మీడియాకు అగ్రిమెంట్ ఆధారాలతో సహా బయటపెట్టారు. అధికారులే భూమికి రేటు ఫిక్స్ చేయలేదు. మరీ మీరు రూ.35 లక్ష‌లు అని ఎలా రేటు ఫిక్స్ చేసి రాశార‌ని నిల‌దీశారు. గత టీడీపీ ప్రభుత్వంలో చర్చ్ ను పడగొట్టి షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టుకున్నది  ఎవరో ... చుక్కలు భూములను రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఎవరో అని నిల‌దీశారు. ఆర్ అండ్ బీ రోడ్డును సైతం నిర్లక్ష్యం‌ చేసి బంకును పెట్టుకున్నది ఎవరో...ప్రజలందరికీ తెలుసు అన్నారు. ఒకరికి ఇనాడు మరొకరికి ఆంధ్రజ్యోతి.... మీకేం కర్మ బాబూ...ఇక నుండి మీ టీడీపీ ఆటలు సాగవని హెచ్చ‌రించారు.   

తాజా వీడియోలు

Back to Top