ప్రపంచాన్ని మార్చే ఆయుధం విద్య ఒక్కటే.. 

 ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను చదవాలన్నదే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ లక్ష్యం

 రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్  

అనంత‌పురం: ప్రపంచాన్ని మార్చే ఆయుధం విద్య ఒక్కటేన‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను చదవాలన్నదే సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ లక్ష్యమ‌న్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఎస్ఎస్సీ, ఇంట‌ర్‌ పబ్లిక్ పరీక్షలలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు "జగనన్న ఆణిముత్యాలు" జిల్లా స్థాయి ప్రతిభా పురస్కార ప్రదానోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు నగదు ప్రతిభా పరష్కరాలును అందజేసి వారి తల్లిదండ్రులను సన్మానించి అవార్డులను అందజేశారు. జిల్లాకు సంబంధించిన నలబై ఎనిమిది లక్షల ఇరవై ఆరువేల రూపాయలు ( 48,26,000/-) చెక్కును విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  వైయ‌స్ జ‌గ‌న్  గారు విద్యా విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టార‌న్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని మీ తల్లిదండ్రులు కన్న కలలును నిజం చేస్తూ ప్రతి ఒక్కరూ జీవితంలో మంచి ఉన్నతమైన స్ధాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ గౌతమి,ఎమ్మెల్సీ వాల్మీకి మంగమ్మ,జిల్లా జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ ,ఏపీ ఉర్ధూ అకాడమీ చైర్మన్ నదీమ్ అహ్మద్,నగర మేయర్ వసీం, నాటక అకాడమీ చైర్మన్ చాములూరి హరిత, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య,కోగటం విజయభాస్కరరెడ్డి, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Back to Top