సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ 

 మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌
 

క‌ర్నూలు:  రాయ‌ల సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అని మంత్రి ఉష‌శ్రీ చ‌ర‌ణ్‌ కొనియాడారు. రాయలసీమ వాసులకు మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని మంత్రి  విమ‌ర్శించారు. క‌ర్నూలు గ‌ర్జ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చిన మంత్రి మీడియాతో మాట్లాడారు. వికేంద్రీకరణతో టీడీపీకి మనుగడ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుంద‌న్నారు. ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా రాయలసీమ ప్రాంతానికి ఎవరూ చేయని పనిని సీఎం వైయ‌స్‌ జగన్ చేశారని అన్నారు. అమరావతి ఏకైక రాజధానికి తాము ఒప్పుకునేది లేదన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి తాము మోసపోయేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.  

Back to Top