పార్టీ పటిష్టతకు కార్యకర్తల కృషి అభినందనీయం

సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం

రాజమండ్రి సిటీ వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీలో మంత్రి తానేటి వనిత, ఎంపీ సుభాష్‌ చంద్రబోస్‌

రాజమండ్రి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం కార్యకర్తలు అహర్నిశలు పాటుపడుతున్నారని, కార్యకర్తల కృషి అభినందనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశానికి హోంమంత్రి తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు బురదజల్లడం దారుణమన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. 

రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 97 శాతం హామీలు నెరవేర్చారన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి విస్మరించారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై చంద్రబాబు రూ.80 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు మిగిల్చి వెళ్లాడని, వాటన్నింటినీ సీఎం వైయస్‌ జగన్‌ తీర్చారన్నారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి.. మూడేళ్లలోనే 97 శాతంహామీలు అమలు చేశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం, నమ్మకం ఉందని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top