ఎంహెచ్‌ జీవితం నేటి తరానికి ఆదర్శం

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

సాక్షి ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్‌కు ఎంహెచ్‌ స్మారక అవార్డు ప్రదానం

పశ్చిమగోదావరి: మోటూరు హనుమంతరావు జీవితం నేటి తరానికి ఆదర్శమని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనతి అన్నారు. మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డును సాక్షి దినపత్రిక ప్రిన్సిపల్‌ కరస్పాండెంట్‌ మాణిక్యాలరావు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరై మాణిక్యాలరావుకు అవార్డు అందజేశారు. ‘ఊస్టింగులే.. పోస్టింగుల్లేవు’ అన్న వార్త కథనానికి మాణిక్యాలరావుకు ఈ వార్డు దక్కింది. అనంతరం మంత్రి వనిత మాట్లాడుతూ.. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా చేసిన తప్పులను నిస్పక్షపాతంగా ఎత్తిచూపాల్సిన బాధ్యత జర్నలిస్టులపై ఉందన్నారు. సమాజంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు పెరుగుతుండడం భయాందోళనకు గురిచేస్తుందని విచారణ వ్యక్తం చేశారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top